సెలబ్రిటీలకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రో బ్యాక్ ఫోటోలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతుంటాయి. సినిమా హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు చూస్తే భలే గమ్మత్తుగా అనిపిస్తుంటుంది. సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలవే కాదు.. క్రికెట్, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుల ఫోటోలు కూడా సినిమా హీరోల మాదిరి చక్కెర్లు కొడుతున్నాయి. ఒకప్పుడు అంటే సినిమా వాళ్ళు మాత్రమే ఫేమస్ అనేలా ఉండేది పరిస్థితి. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా హీరోల్లానే తయారవుతున్నారు. కాదు కాదు, అభిమానులు వాళ్ళని అలా తయారు చేస్తున్నారు. రియల్ హీరోలంటూ తమ నాయకులను చూసి మురిసిపోతున్నారు.
ఇటీవలే ఒక పవర్ ఫుల్ సీఎంకి సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పొలిటీషియన్ల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలో కనిపిస్తున్న పిల్లలను గుర్తుపట్టారా? డ్రెస్సింగ్ టేబుల్ ముందు వెనక్కి తిరిగి స్టూల్ మీద నిలుచుని అమ్మాయి, అబ్బాయి ఫోటోకి ఫోజులు ఇచ్చారు. గళ్ళ చొక్కా, చిన్న లాగు వేసుకుని తల పైకెత్తి హీరోలా నవ్వుతున్న కుర్రాడు.. ఆ పక్కనే ముద్దు ముద్దుగా నవ్వుతున్న చిన్నారిని చూస్తుంటే మీకు ఎవరో గుర్తు రావడం లేదా? ఒకరు ఆంధ్ర నాయకుడు, మరొకరు తెలంగాణ నాయకురాలు. ఇద్దరూ మహా నాయకుడి కడుపున పుట్టినవాళ్లే. అన్నాచెల్లెళ్లు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది.
అవును వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల బిడ్డలు ఈ ఇద్దరు. ఒకరు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాగా.. మరొకరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇద్దరూ ఇద్దరే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఎలా అయితే.. దూకుడుగా వ్యవహరించారో.. తెలంగాణలో అదే దూకుడుని ఆయన సోదరి షర్మిల చూపిస్తున్నారు. మాటల్లోనూ, చేతల్లోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. అన్న అధికారంలో ఉన్నారు, మరి ఆయన సోదరి షర్మిల కూడా అధికారం కైవసం చేసుకుంటారో లేదో చూడాలి. ప్రస్తుతం అన్నాచెల్లెళ్లు ఇద్దరూ చిన్నతనంలో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.