మీరు చూస్తున్న ఈ వీడియో ఏదో సినిమాలో జరిగిన ఫైటింగ్ సన్నివేశం అనుకుంటే పొరపాటు. చూడటానికి సినిమా లెవల్ ల్లో ఉన్నా.. జరిగింది మాత్రం రీల్ ఫైట్ కాదు, రియల్ ఫైట్. అవును మీరు విన్నది నిజమే. తాజాగా ఏపీలోని చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అసలు వీళ్లంత కర్రలతో ఎందుకు కొట్టుకుంటున్నారు? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
అది ఏపీలోని అనకాపల్లి జిల్లా మాకవారెంపాలెం మండలం నగరం గ్రామం. ఇటీవల సంక్రాంతి పండగ నేపథ్యంలో యువకులు వాలీ బాల్ టోర్నీ నిర్వహించారు. ఇందులో భాగంగానే గ్రామంలోని చాలా మంది యువత ఈ టోర్నీలో పాల్గొన్నారు. కానీ ఎక్కడో జరిగిన చిన్న తప్పిదం వల్ల యువకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇక ఇంతటితో ఆగక ఒకరిపై ఒకరు మాటలు దాడి చేసుకోవడంతో కాస్త వివాదం చోటు చేసుకుంది. ఆ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో యువకులతో పాటు గ్రామంలోని ప్రజలు కర్రలతో దాడి చేసుకున్నారు.
ఇలా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే వీరు కొట్టుకుంటున్న ఈ సీన్ ను కొందరు యువకులు తమ తమ సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. ఆ తర్వాత అదే వీడియోను కొందరు యువకులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) January 18, 2023