ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు దగ్గర పడుతున్నా కొద్ది చాలా మంది ఆశావహుల్లో టెన్షనన్ నెలకొంది. సీఎం జగన్ మనసులో ఏముందో.. ఎవరు కొత్తగా మంత్రీ పదవుల్లోకి వస్తారో అన్న విషయంలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే జగన్ చివరి కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం. ఇక మంత్రుల్లో కొంత మంది తమ మనసులోని విషయాలు బాహాటంగానే బయట పెడుతున్నారు.
ఉత్తరాంధ్రకు చెందిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మంత్రివర్గ విస్తరణపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో తన మంత్రిపదవికి దూరమైనప్పటికీ తన తమ్ముడు ధర్మాన ప్రసాదరావు మంత్రి అవుతాడన్న గట్టి నమ్మకం తనకు ఉందని అన్నారు. వైయస్ఆర్ మరణం తర్వాత ప్రతి విషయంలోనూ జగన్ వెన్నంటి ఉన్నానని అన్నారు. తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశానని అన్నారు. ఆ సమయంలో తన తమ్ముడు మంత్రి వర్గంలో కొనసాగుతున్నాడని అన్నారు. తర్వాత వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచామని అన్నారు.
సీఎం తనపై నమ్మకంతో డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారని అన్నారు. త్వరలో తన తమ్ముడికి మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా మా కుటుంబంలో ఎవరు మంత్రి అయినా సంతోషమే అన్నారు.