మన దగ్గర చాలామంది.. మన కోరికలను దేవుడి దగ్గర విన్నవించుకుని.. ఆ కోరికలు తీర్చితే.. మనకు చేతినైనంత దేవుడికి సమర్పిస్తాం అని మొక్కుకుంటారు. ఆ కోరికలు నేరవేరిన తర్వాత.. మొక్కులు తీర్చుకుంటాం. చాలా మంది ఇలానే చేస్తారు. ఇక ఇలా భక్తులు అధికంగా.. భారీ ఎత్తున కానుకలు సమర్పించేది తిరుమల వెంకటేశ్వర స్వామికి. ఏడుకొండల వాడికి.. ఏటా ఎందరో భక్తులు.. ఎన్నో విలువైన కానుకలు అందజేస్తారు. వీటిల్లో కోట్ల రూపాయల బంగారు ఆభరణాలు కూడా ఉంటాయి. అయితే తిరుమల శ్రీనవివాసుడికి ఇలాంటి కానుకలు అందించడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయమే. కానీ తొలిసారి ఒక ఆశ్చర్యకరమైన విషయం చోటు చేసుకుంది. కర్నూలులోని వెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు.. ఏకంగా కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు కానుకగా అందజేశాడు. ఆ వివరాలు..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. భక్తులు.. కర్నూలులోని వెంకటేశ్వరుడికి భక్తులు ఏకంగా కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు చేయించారు. కర్నూలు వెంకటరమణ కాలనీలో ఉన్న.. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవార్లకు రూ.16.50 కోట్లతో ఆభరణాలు చేయించారు భక్తులు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తయారుచేసిన బంగారు కవచం, ఆభరణాలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. భక్తుల నుంచి సేకరించిన విరాళాలతో వీటిని తయారు చేయించినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.