కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వేంకటేశ్వర స్వామి క్షేత్రంలో మరోసారి భద్రతా వైపల్యం బయట పడింది. నిఘా వర్గాల కళ్లు గప్పి సీక్రెట్ కెమెరాతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన ఓ భక్తురాలు, ఆలయ విమాన గోపురాన్ని తన ఫోన్‌లో చిత్రీకరించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
తిరుమలలో మరోసారి భద్రతా వైపల్యం బయట పడింది. నిఘా వర్గాల కళ్లు గప్పి ఓ భక్తురాలు సీక్రెట్ కెమెరాతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించింది. ఆపై ఆమె శ్రీవారిని దర్శించుకున్నాక ఆనంద నిలయం వద్దకు చేరుకొని.. ఆలయ విమాన గోపురాన్ని తన కెమెరాలో చిత్రీకరించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ వీడియో బయటకు రావడంపై తీవ్ర దుమారం రేపుతోంది. వారం రోజుల క్రితం తిరుమలకు ఉగ్ర ముప్పు పొంచివున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితులలో ఈ ఘటన చోటు చేసుకోవటం తిరుమల భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వేంకటేశ్వర స్వామి క్షేత్రంలో తరచూ అపవిత్రమవుతోంది. మద్యం, మత్తు పదార్థాలు, నిషేధిత వస్తువులు తరచూ ప్రత్యక్షమవుతున్నాయి. వీటిన్నిటికి భద్రతా వైఫల్యమే కారణమని మాటలు వినపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆనంద నిలయాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవ్వడం సంచలనంగా మారింది. నిఘా వర్గాల కళ్లు గప్పి సీక్రెట్ కెమెరాను ఆలయంలోకి తీసుకెళ్లిన ఓ భక్తురాలు, అతి సమీపం నుంచి ఆలయ విమాన గోపురాన్ని చిత్రీకరించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. టీటీడీ భద్రతా నిర్వహణపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, శ్రీవారి ఆలయంలోకి సీక్రెట్ కెమెరా తీసుకెళ్లడం చూస్తుంటే భద్రతా వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. వాస్తవంగా తిరుమలలో పటిష్ట భద్రత ఉంటుంది. అనేక చోట్ల భద్రతా సిబ్బంది తనిఖీలు ఉంటాయి. ప్రతి భక్తుడిని క్షుణ్నంగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు. అలాంటిది సెల్ ఫోన్ ను గుర్తించలేకపోయారంటే భద్రతా సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలుస్తోంది. ఈ ఘటనను టీటీడీ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ ఘటనలో తప్పు ఎవరిదో..?.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
తిరుమలలో మరోసారి భద్రత వైపల్యం..
సెల్ ఫోన్‌తో తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రవేశించిన భక్తురాలు.. pic.twitter.com/rkX36sbwxV
— Dharani Pilli (@DharaniPilli) May 8, 2023