ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి రెండోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నారాయణస్వామి అవకాశం దొరికినప్పుడల్లా జగన్ పై తనకున్న స్వామిభక్తిని నిరూపించుకుంటారని తెలిసిందే. తాజాగా బాధ్యతల స్వీకరణ రోజు కూడా ఆయన స్వామిభక్తిని బయటపెట్టారు. సీఎం జగన్ చిత్రపటంతో ఛాంబర్ లో అడుగుపెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బాధ్యతలు స్వీకరించారు. సీఎం ఫొటో పట్టుకుని ఎందుకు ఛాంబర్ లోకి వెళ్లారు అనే దానిపై నారాయణస్వామి స్పందించారు. జగన్ దేవుడి లక్షణాలు కలిగిన వ్యక్తి అని.. ఆయన ఫొటో పట్టుకుని ఛాంబర్లోకి ప్రవేశించినట్లు తెలిపారు. కాళ్లు పట్టుకుంటేనో, కాకా పడితేనో జగన్ పదవులు ఇవ్వరని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికే పదవులు ఇస్తారని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: ఏపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుపై కేసు నమోదు!
తనకు రెండోసారి మంత్రి పదవి దక్కుతుందని అనుకోలేదని అన్నారు. తనకు సీఎం జగన్ అప్పగించిన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేరుస్తానని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం రెడ్ల రాజ్యం కాదని.. ఇది బడుగుల రాజ్యమని నారాయణస్వామి వ్యాఖ్యానించారు. బడుగులకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను చూసి.. తాము కూడా ఎస్సీలుగా పుడితే బాగుండేదని రెడ్లు అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.