గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో ఏపీకి కనీవినీ ఎరుగని స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. రెండు రోజుల్లో 13 లక్షల కోట్లకు పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 352 ఎంఓయూలు జరిగాయి. శాఖల వారీగా పెట్టుబడులు ఎలా ఉన్నాయంటే?
ఏపీకి పెట్టుబడులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూసిన ఆశావహుల ఆశలు ఎట్టకేలకు ఫలించాయి. నిరుద్యోగ యువత ఎదురుచూపులకు ఇన్నాళ్లకు సమాధానం ఇచ్చారు. అయితే ఇన్నాళ్లు ఎదురుచూసినందుకు తగిన ఫలితమే దక్కిందని అనుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఊహించని స్థాయిలో పెట్టుబడుల వరదను సృష్టించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో ఏపీకి ఊహించని స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. ఇక ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో దేశవ్యాప్తంగా ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలు, బడా సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, సంజీవ్ బజాజ్, నవీన్ జిందాల్, ప్రీతారెడ్డి, జీఎంఆర్ సహా పలువురు పాల్గొని ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు.
ఇప్పటి వరకూ 13 లక్షల 6 వేల 682 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 352 ఎంఓయూలు జరిగాయి. ఈ పెట్టుబడులతో 6 లక్షల 3 వేల 223 మందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం జగన్ ప్రకటించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయానికి కృషి చేసిన వారందరికీ సీఎం జగన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోందని, పారదర్శక పాలనతోనే విజయాలు సాధిస్తున్నామని అన్నారు. ఏపీకి ఈ స్థాయిలో పెట్టుబడుల వరద తీసుకొచ్చిన సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వివిధ రంగాల్లో మొత్తం 6 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. ఎనర్జీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఐటీ అండ్ ఐటీఈఎస్, పర్యాటకం, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ వంటి విభాగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి.
ఇప్పటివరకూ 13 లక్షల కోట్లకు పైనే పెట్టుబడులు వచ్చాయి. మరి ఏపీకి ఈ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.