ఢిల్లీ లిక్కర్ స్కాం ఘటనలో తీహార్ జైలుకు మాగుంట రాఘవ. ఈడీ కస్టడీ నేటితో ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా, విచారించిన న్యాయస్థానం మార్చి 4 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు రాఘవను తీహార్ జైలుకు తరలించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం ఘటనలో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవ అరెస్టైన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ కేసులో రాఘవను అరెస్టు చేసిన ఈడీ, కోర్టు అనుమతితో 10 రోజుల కస్టడీకి తీసుకుంది. ఈ కస్టడీ నేటితో ముగియడంతో ఈడీ అధికారులు రాఘవను మరోసారి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. విచారించిన న్యాయస్థానం మార్చి 4 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు రాఘవను తీహార్ జైలుకు తరలించారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అరెస్టైన ఏపీ వైఎస్సార్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని తీహార్ జైలుకు తరలించారు. రాఘవకు విధించిన కస్టడీ గడువు ఈరోజుతో పూర్తికావడంతో ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా, విచారించిన న్యాయస్థానం మార్చి 4 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో రాఘవను తీహార్ జైలుకు తరలించారు. సౌత్ గ్రూప్ తరఫున చెల్లించిన రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో రాఘవ పాత్ర ఉందని విచారణ సందర్భంగా ఈడీ వాదనలు వినిపించింది. మాగుంట రాఘవకు తయారీ, హోల్‌సేల్ వ్యాపారం, 2 రిటైల్ జోన్స్ కూడా ఉన్నాయని, వీటి ద్వారా రూ.100 కోట్ల ముడుపుల్లో అతడు కీలకంగా వ్యవహరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, తదుపరి విచారణ కోసం రాఘవను కస్టడీకి ఇవ్వాలని కోరింది. ఈడీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు 10 రోజుల ఈడీ కస్టడీకి అనుమతిచ్చింది.