నేడు ‘చదువు’ అంటే.. లక్షలు పెట్టి కొనాల్సిన పరిస్థితి. మీ పిల్లాడు ఏం చదువుతున్నాడమ్మా అంటే.. LKG అంటారు. ఇక ఫీజ్ ఎంతమ్మా అంటే.. పది వేలు అంటారు. ఇది మాములు స్కూల్లలో మాత్రమే. ఇక పేరున్న బడుల్లో అయితే 50 నుంచి 70 వేలు అంటారు. పిల్లాడికి చూస్తే ఐదేళ్లు.. ఆడుకునే వయసు. ఇంట్లో ఉంటే అల్లరి చేస్తాడని బడికి పంపాలి. వాళ్ళు చూస్తే లక్షలు అడుగుతారు. పోనీ ఇంత పెట్టి చదివిస్తే మంచి ఉద్యోగం చేస్తారా అంటే అది కొంత మందే. కానీ.. నేను అందరిలా కాదంటోంది ఈ అమ్మాయి.
ఆమె తండ్రి జీడి పరిశ్రమలో గుమాస్తా.. నెలకు రూ.10 వేల సంపాదన కూడా ఉండేది కాదు.. అయినా రెక్కల కష్టంతో కుమార్తెను చదివించాడు. తండ్రి నమ్మకాన్ని ఆమె వమ్ము చేయలేదు. కష్టపడి చదివింది. ప్రముఖ అమెజాన్ సంస్థలో సాప్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా ఏడాదికి రూ.44 లక్షల జీతానికి ఎంపికైంది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని కొంచాడ స్నేహకిరణ్ సాధించిన ఘనత ఇది. విశాఖలోని అనిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్(సీఎస్‌సీ) నాలుగో సంవత్సరం చదువుతున్న స్నేహ.. 2021 డిసెంబరులో క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరైంది. సాప్ట్‌వేర్ డెవలపర్‌గా రూ. 44 లక్షల వార్షిక వేతనంతో అమెజాన్ సంస్థకు ఎంపికైనట్లుగా తెలిపింది. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇది కూడా చదవండి: పంటను కాపాడేందుకు ఎలుగుబంటిని కాపలా పెట్టిన రైతు..!కోవిడ్ సమయంలో కాలేజీలకు సెలవులు వచ్చినా.. తాను మాత్రం చదువుపై అశ్రద్ధ వహించలేదని తెలిపింది. ఈ సమయంలో ఆన్లైన్ ద్వారా కోడింగ్ విధానం నేర్చుకున్నట్లు తెలిపింది. స్నేహితులతో కలిసి సొంతంగా గ్రూప్ డిస్కషన్స్ జరిపేవారిమని చెప్పుకొచ్చింది. ఇవన్నీ ఉద్యోగాయానికి ఎంపిక కావడానికి ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపింది. స్నేహ చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేదని, గణితం అంటే బాగా ఆసక్తని స్నేహ తండ్రి సింహాచలం తెలిపారు. తాను నెలకు రూ.10 వేలు కూడా సంపాదించలేక పోయేవాడినని.. తన కుమార్తె ఏడాదికి రూ.44 లక్షల వేతనానికి ఎంపిక కావడం ఆనందంగా ఉందని మెరుస్తున్న కళ్లతో చెప్పాడు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.