రాజకీయాల్లో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు అయినా సరే.. వేర్వేరు పార్టీల్లో ఉంటే ప్రత్యర్థులు అనే అంటారు. ఇక వారి మధ్య చోటు చేసుకునే సంభాషణలు, సంఘటనలు ఆసక్తికరంగా మారతాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఆయన పెద్దమ్మ, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఓ న్యూస్ చానెల్ ఇంటర్వ్యూలో.. నారా లోకేష్ భవిష్యత్ టీడీపీ సారధి అంటున్నారు. బీజేపీ నేతగా కాకుండా.. పెద్దమ్మగా లోకేష్ నాయకత్వ సామార్ధ్యాన్ని ఏవిధంగా చూస్తారు అని ప్రశ్నించారు విలేకరి. అందుకు పురంధేశ్వరి.. నారా కుటుంబంతో తన బంధుత్వాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘లోకేష్ తల్లి భువనేశ్వరికి అక్కగా, పెద్దమ్మ హోదాలో ఈ మాట చెబుతున్నాను. రాజకీయాల్లో లోకేష్ తన సొంత లక్ష్యాలను, మార్గాన్ని తనే నిర్దేశించుకోవచ్చన్నారు’’. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తెలుగు తమ్ముళ్లు దీన్ని తెగ ట్వీట్ చేస్తున్నారు. పురంధేశ్వరి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
లోకేష్ కి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మంచి నాయకుడు అవుతాడు – పురందేశ్వరి pic.twitter.com/3ciEp9eIbU
— I Love India✌ (@Iloveindia_007) April 18, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.