సాధారణంగా వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరని అంటారు. నిజమే.. ఈ మద్య చాలా మంది ఊహించని విదంగా చనిపోతున్నారు. అప్పటి వరకు సంతోషాంగా మనతో గడిపిన వాళ్లు అకస్మాత్తుగా కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోతుంది.
మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో అస్సలు ఊహించలేరు. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా మన కంటికి దూరమై అనంత లోకాలకు వెళ్లిపోతారు. ఇటీవల పలు చోట్ల గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు, కరెంట్ షాక్ ఇలా పలు కారణాల వల్ల అకాల మరణం చెందుతున్నారు. ప్రతి ఒక్కరు తమ కుటుంబంలో జరిగే వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని భావిస్తారు. అలానే బంధువులందరిని ఆహ్వానించి తమ ఇంట్లోనే జరిగే కార్యాయన్ని ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇలా జరుపుకునే వేడుకల్లో కొన్నిసార్లు విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో ఘోరో విషాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
అన్నమయ్య జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పెద్ద తిప్పసముద్రం మండలం కానుగమాకులపల్లెలో గృహ ప్రవేశ వేడుకలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ కొట్టి.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నిర్మించిన గృహ ప్రవేశ కార్యక్రమానికి బంధుమిత్రులు విచ్చేశారు. ఇంటి ముందు షామియానా వేశారు. ఒక్కసారిగా ఈదురు గాలులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే షామియానా పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలపై పడటంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మరో ఇద్దరు చనిపోయారు. మరికొంత మందిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.
గృహ ప్రవేశానికి వచ్చి చనిపోయిన మృతులు బి. కొత్తకోట మండలం కొత్తపల్లికి చెందిన చిన్న లక్ష్మమ్మ, మనువడు విజయ్ ప్రశాంత్ గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో చనిపోయారు.. మృతులు కొత్తకోటకు చెందిన శాంత కుమారి, లక్ష్మణ గా గుర్తించారు. ఎంతో సంతోషాల మద్య జరగాల్సిన గుృహ ప్రవేశం కార్యక్రమంలో నలుగురు చనిపోవడంతో కుటుంబం సభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.