దొంగలు బాగా తెలివి మీరిపోయారు. వింత దొంగతనాలకు పాల్పడుతూ.. ఎప్పటికో పోలీసులకు దొరుకుతున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు చందంగా అప్పుడుకు గానీ వాళ్లకు నిజాలు తెలియడం లేదు. చివరకు పోలీసులు కూడా అవాక్కు అవుతున్నారు. తాజాగా అటువంటి ఓ దొంగతనం ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
దొంగలు బాగా తెలివి మీరిపోయారు. కొత్త కొత్త దొంగతనాలు చేస్తూ.. పోలీసులకు కూడా చిక్కడం లేదు. ఇంట్లోని సామానుల నుండి గుడిలోని దేవతా మూర్తుల నగలను మూడో కంటికి తెలియకుండా దోచేస్తున్నారు. దోచిన వస్తువు ఎవ్వరూ పసిగట్టకుండా టెక్నిక్‌లను వాడుతున్నారు. అంతేకాదూ వింత దొంగతనాలకు పాల్పడుతూ.. ఎప్పటికో పోలీసులకు దొరుకుతున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు చందంగా అప్పుడుకు గానీ వాళ్లకు నిజాలు తెలియడం లేదు. చివరకు పోలీసులు కూడా అవాక్కు అవుతున్నారు. తాజాగా అటువంటి ఓ దొంగతనం ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇంటి బయట పెట్టిన బైక్‌లు కొంత కాలం నుండి మాయం అవుతున్నాయి. ఇవి ఎవరూ మాయం చేస్తున్నారో పోలీసులకు కూడా తెలియడం లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వాటి ఆచూకీ కోసం వెతుకుతున్న సమయంలో ఓ ట్విస్ట్ ఎదురైంది.
విజయ నగరం కొణిసి వీధికి చెందిన బంగార్రాజు తన ఇంటికి ముందు తన బైక్‌ను పార్క్ చేయగా.. దొంగలు ఎత్తు కెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం కృష్ణ థియేటర్ సమీపంలో పోలీసుల వాహనాన్ని చూసి నలుగురు పరారయ్యేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకొని ఆరా తీస్తే.. విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. వీరంతా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారని తేలింది. పార్కింగ్ చేసిన బైకులను దొంగతనం చేసి.. ఆ తర్వాత వాటిని విడి భాగాలు తీసేసి.. సెకండ్ హ్యాండ్‌లో అమ్మేస్తున్నారు. దీంతో పోలీసులు కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. బంగ్రారాజు బైకును కూడా అలా దొంగిలించి.. కమ్మవీధికి చెందిన పైడిరాజు అనే వ్యక్తికి విక్రయించినట్లు చెప్పారు. ఈ కేసులో కె.కుమార్, సీహెచ్.జగదీష్, హెచ్.హంస, వి.రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ గ్యాంగ్ చోరీ చేసిన బైకులను భాగాలుగా విడగొట్టి అమ్మేస్తున్నట్లు గుర్తించారు. మరో నిందితుడు పైడిరాజు పరారీలో ఉండగా, మూడు బైక్‌లకు సంబంధించిన విడి భాగాలను స్వాధీనం చేసుకున్నారు. బైక్‌లను ఇంటి బయట పార్క్ చేసేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.