తమ అవసరాలకు ఇతరుల వద్ద అప్పు చేస్తున్నారు. అవి కట్టలేక ..మొహాలు దాచుకోవడం ఏదో ఓ సందర్భంలో ఎదుర్కొనే ఉంటారు. అయితే అప్పు ఇచ్చిన వ్యక్తులు.. వదిలి పెట్టరు. ముక్కు పిండి వసూలు చేస్తారు. కాదంటే..
డబ్బు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతుంది. అవసరానికి మించిన కోరికలు మనుషుల్ని అథో పాతాళానికి తీసుకెళుతున్నాయి. ఉన్నంతలో బతకం మానేసి.. తమ అవసరాలకు ఇతరుల వద్ద అప్పు చేస్తున్నారు. అవి కట్టలేక ..మొహాలు దాచుకోవడం ఏదో ఓ సందర్భంలో ఎదుర్కొనే ఉంటారు. అయితే అప్పు ఇచ్చిన వ్యక్తులు.. వదిలి పెట్టరు. ముక్కు పిండి వసూలు చేస్తారు. కాదంటే ఇంట్లో ఉన్న వస్తువులను తీసుకెళతారు. ఇలా ఉంటే అప్పులు ఇచ్చిన వారి తిప్పలు వేరో రకం. మోహమాటానికి, వడ్డీకి వస్తాయని డబ్బులు ఇస్తే అప్పు తీసుకున్న వాళ్లు.. వాటిని తీర్చకపోగా అఘాయిత్యాల కూడా వెనుకాడటం లేదు. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని విషయంలో ఇదే జరిగింది.
ప్రకాశం జిల్లాలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధ దారుణ హత్యకు గురైంది.. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాధ, ఆమె భర్త ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. వీరూ హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఇటీవల తన ప్రకాశం జిల్లాలోని సొంత గ్రామానికి పిల్లలతో కలిసి వచ్చింది. నిన్న సాయంత్రం వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. ఎంతకూ ఆచూకీ లభించకపోవడంతో పాటు ఫోన్ కూడా స్విచ్చాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగారు. సెల్ లొకేషన్ ఆధారంగా జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద ఉన్నట్టు గుర్తించారు.. అక్కడికి వెళ్లి చూస్తే.. రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అయితే రాధను ఆమె స్నేహితుడు కాశిరెడ్డి చంపేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. అతడు ఫోన్ చేస్తే తన కుమార్తె వెళ్లిందని, అతడి నుండి డబ్బులు తీసుకోవాలని వెళ్లిందని, డబ్బు విషయంలోనే వారి మధ్య గొడవ జరిగి, రాధను చంపేసి ఉంటారని పేర్కొంటున్నారు. అయితే ప్రాథమిక విచారణలో ఆమెను మరో చోట హత్య చేసి.. ఇక్కడకు తీసుకు వచ్చి పడేసినట్లు తేలిందని పోలీసులు చెబుతున్నారు. ఫోన్ ట్రాక్ ఆధారంగా ఆమె కనిగిరి వెళ్లిందని తెలిసిందన్నారు. దీంతో పోలీసులు కాశిరెడ్డిని బెంగుళూరు తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతకి రాధను హత్య చేసింది ఆమె స్నేహితుడు కాశిరెడ్డినా? లేక మరెవరైనా హత్య చేసి చంపారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.