ఇంట్లో అవసరాలకు, పిల్లల చదువులకు, ఇతర ఖర్చులకు సంపాదిస్తున్న సొమ్ము సరిపోక అప్పులు చేస్తున్నారు సామాన్యులు. తెలిసిన వాళ్లు, తెలియని వాళ్ల దగ్గర.. చివరకు ఆన్ లైన్ యాప్స్ ద్వారా కూడా అప్పులు చేసి.. కట్టలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇటీవల చూశాం. తాజాగా
అప్పులు ఎంతటి తిప్పలు తెస్తున్నాయో ఇటీవల చాలా ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంట్లో అవసరాలకు, పిల్లల చదువులకు, ఇతర ఖర్చులకు సంపాదిస్తున్న సొమ్ము సరిపోక అప్పులు చేస్తున్నారు సామాన్యులు. తెలిసిన వాళ్లు, తెలియని వాళ్ల దగ్గర.. చివరకు ఆన్ లైన్ యాప్స్ ద్వారా కూడా అప్పులు చేసి.. కట్టలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇటీవల చూశాం. మొన్నటికి మొన్న అప్పు చెల్లించని కారణంగా 11 ఏళ్ల బాలికను బాకీ కింద జమ చేసుకుని, తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు 40 ఏళ్ల వ్యక్తి. డబ్బులు వడ్డీలకు ఇచ్చి.. దందా నడుపుతున్న వీరి ఆగడాలకు అంతుపొంతు లేకుండా పోయింది. అప్పు కట్టలేదని ఓ మహిళపై యాసిడ్ దాడి చేశాడో వ్యక్తి.
ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పెడనలోని రామ లక్ష్మి కాలనీలో నివసిస్తున్న కరుణ కుమారి.. రాముడు అనే వ్యక్తి వద్ద రూ. 20 వేలు అప్పు జేసింది. భర్తకు తెలియకుండా ఈ అప్పు చేయగా.. తిరిగి ఆ డబ్బులు చెల్లించాలని రాముడు ఒత్తిడి తీసుకు వస్తున్నాడు. ఆమె ఇవ్వకపోవడంతో అక్కసు పెంచుకున్నాడు. మంగళవారం మరోసారి అడిగేందుకు వెళ్లిన రాముడు.. కరుణ కుమారిపై యాసిడ్ దాడి చేశాడు. ఈ దాడిలో మహిళ కరుణ కుమారి తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానికులు మచిలీ పట్నం ఆసుపత్రికి తరలించారు. కరుణకుమారిపై యాసిడ్ దాడి చేసిన రాముడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.