మన ఇంట్లో వారే కదా.. మన స్నేహితుడే అని నోటికి వచ్చిందల్లా వాగి తలనొప్పులు తెచ్చుకుంటున్నారు. చిన్న మాట కూడా దురుసుగా చెప్పడం వల్ల .. ఆ మాట పడిన వారు తీసుకోవడం లేదు. కుటుంబ సభ్యులు అయితే మందలించి వదిలేస్తారు. లేదా ఇలా ఇంకోసారి అన్నొద్దు అంటూ హిత బోధ చేస్తారు. కానీ పరాయి వాళ్లను
తన కోపమే తనకు శత్రువు అన్నది సామెత. కోపంలో, ఆవేశంలో అనే మాటలు ఎన్నో అనార్థాలకు దారి తీస్తాయి. ఒక్కోసారి ప్రాణం మీదకు తెస్తాయి. మన ఇంట్లో వారే కదా.. మన స్నేహితుడే అని నోటికి వచ్చిందల్లా వాగి తలనొప్పులు తెచ్చుకుంటున్నారు. చిన్న మాట కూడా దురుసుగా చెప్పడం వల్ల .. ఆ మాట పడిన వారు తీసుకోవడం లేదు. కుటుంబ సభ్యులు అయితే మందలించి వదిలేస్తారు. లేదా ఇలా ఇంకోసారి అన్నొద్దు అంటూ హిత బోధ చేస్తారు. అదే కుటుంబ సభ్యులను అన్నట్లు పరాయి వాళ్లను అంటే ఊరుకోరు. అవి ఒక్కోసారి కుటుంబ సమస్యలకు దారి తీస్తాయి. చివరకు వార్నింగ్స్, కొట్లాడలు, గొడవలు, ఘర్షణలు జరుగుతుంటాయి. ఓ వ్యక్తి నోటి దూల వల్ల అతడి ప్రాణం మీదకు తెచ్చుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
భార్య, పిల్లల్ని ఓ మాట అన్నాడని స్నేహితుడినే చంపాశాడో వ్యక్తి. ఈ దారుణ ఘటన డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏలేశ్వరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన కోరాడ మణికంఠ, దుర్గా ప్రసాద్ స్నేహితులు. అయితే ఈ నెల 11 రాత్రి మణికంఠను దుర్గా ప్రసాద్ కారులో బయటకు తీసుకెళ్లాడు. ఎంత సేపైనా ఇంటికి రాలేదు. అయితే అనుమానం వచ్చిన మణికంఠ తండ్రి శ్రీనివాసరావు ..తన బంధువులతో కలిసి వెతికాడు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్దకు రాగానే కారులో వస్తున్న దుర్గా ప్రసాద్ ను నిలదీశాడు. ముందు తనకు తెలియదని బుకాయించిన దుర్గా ప్రసాద్.. ఆ తర్వాత గట్టిగా అడగడంతో తానే చంపేసినట్లు అంగీకరించాడు.
తన తాతను మణికంఠ తిట్టాడని, ఎందుకు రా తిట్టావని అడిగితే. ‘నువ్వు ఊరిలో లేనప్పడు నీ పెళ్లాం, పిల్లల పీకలు కోస్తానని’ అనడంతో కోపంతో తానే బయటకు తీసుకెళ్లి కారుతో తొక్కించి చంపేశానని దుర్గా ప్రసాద్ వెల్లడించాడు. మణికంఠ తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా సీఐ కిషోర్‌బాబు, ఎస్సై సతీష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అనవసరపు మాటలు అనార్థాలకు దారి తీస్తాయి ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలిచింది.