వానకాలంలో చేపలు ఒడ్డుపై ఎలా దూకుతాయో... ఎన్నికల సమయంలో ఓటర్లపై వరాలు వరదలా దూకుతుంటాయి. గతంలో మునుగోడు ఎన్నికలో నాయకులు చేసిన సందడి అంతాఇంతా కాదు. ఇలాంటి ఎన్నికల ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా ఏపీలో కూడా జరుగుతున్నాయి. ఏపీ ఓటర్లకు కుక్కర్లు ఇస్తూ నాయకులు గాలం వేస్తున్నారు.
వానకాలంలో చేపలు ఒడ్డుపై ఎలా దూకుతాయో… ఎన్నికల సమయంలో ఓటర్లపై వరాలు వరదలా దూకుతుంటాయి. గతంలో మునుగోడు ఎన్నికలో నాయకులు చేసిన సందడి అంతాఇంతా కాదు. ఉదయం టిఫిన్ ఓ పార్టీ వాళ్లు పెట్టిస్తే.. మధ్యాహ్నం భోజనం మరొక పార్టీ వాళ్లు పెట్టే వాళ్లు. ఎన్నికలు ఉన్నన్ని రోజులు ఓటర్లే నాయకులకు దేవుళ్లు. ఎలక్షన్స్ జరిగినన్ని రోజులు చాలా మంది ఇళ్లలో గ్యాస్ వెలిగించడమే మానేశారు. ఇక ఓటర్లను కాక పట్టేందుకు వివిధ బహుమతులు, నగదు వంటివి నాయకులు ఇస్తుంటారు. తాజాగా ఏపీ ఓటర్లకు కొందరు నాయకులు కుక్కర్లు గాలం వేశారు. మరి.. ఏపీలో ఎన్నికలు లేవు కదా? అనే సందేహం మీకు రావచ్చు. అయితే అసలు వివరాల్లో ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి నడుస్తుంది. వచ్చే ఏడాది లోక్ సభ సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల జరగనున్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. అయితే తొలుత కర్ణాటకలో ఎన్నికల నగరా మోగింది. దీంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు. కర్నాటక ఎలక్షన్స్ లో కొన్ని పార్టీల వారు ఓటర్లకు గాలం వేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో ఉన్న వారిని కాక పట్టేందుకు నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నిఇన్ని కావు.
కర్ణాటకలో ఓటర కార్డుఉన్న ఆంధ్రుల ఓట్లు దండుకునేందుకు ఓ నాయకుడు కుక్కర్లను బహుమతిగా ఇచ్చాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉన్న చౌడేశ్వరి గుడిలో ఓటర్ల లిస్ట్ తీసుకుని, కుక్కర్లు, ఇతర వస్తువులకు సంబంధించిన కూపన్లు పంచుతూ ఓ నాయకుడి తరపు వారు పంచుతున్నారు. ఈ విషయాన్ని మరోపార్టీ వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడి వెళ్లి కుక్కర్లు పంచుతున్న వారిని పట్టుకున్నారు. అంతేకాక ఓటర్లకు పంచాలనుకున్న కుక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలానే అక్కడ ఉన్న కూపన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
డబ్బులకు, బహుమతులకు ప్రలోభ పడే జనాలు ఉన్నప్పుడు, నాయకులు ఇస్తే తప్పేముందని కొందరు అంటున్నారు. నాయకులు ప్రలోభ పెడుతుంటే స్వచ్ఛగా డబ్బులు, బహుమతులు తీసుకునే హక్కు ఆ ఓటర్లకు లేదా? అంటూ మరికొందరు వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కర్ణాటక నాయకులు ఆంధ్ర ఓటర్లకు ఇలా గాలం వేసి.. తమ వలలో పడేలా ప్రయత్నాలుచేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు.. ఏపీ ఓటర్లకు కుక్కర్లు గాలం వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.