కలియుగదైవం శ్రీతిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనానికి ప్రపంచ నలుమూల నుంచి నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తలు రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. మరొక పక్క తిరుమల అభివృద్ధికి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈక్రమంలో శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి తిరుమల కొండపై ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధం అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ మంగళవారం ఈ ప్రకటన విడుదల చేసింది. జూన్ 1 నుంచి తిరుమల కొండపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించమని స్పష్టం చేసింది. తిరుమల కొండపై పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇది ఈ బుధవారం నుంచి అమల్లోకి రానున్నట్లు టీటీడీ వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయానికి అందరు సహకరించాలని టీటీడీ కోరింది. చాలా రోజులుగా తిరుమలలో ప్లాస్టిక్ నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ వాడకాని నిషేధించాలని నిర్ణయించింది. దీనికోసం తిరుమలలో దుకాణదారులతో సమావేశం నిర్వహించింది. భక్తులను ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, కవర్లలో పూజా సామాగ్రితో ఇక నుంచి కొండపైకి అనుమతించరు.
ఇదీ చదవండి: గల్ఫ్‌లో తిరుపతి మహిళకు వేధింపులు.. కోర్కెలు తీర్చమంటూ గదిలో బంధించి..
అలాగే ఆలయానికి అనుబంధంగా ఉండే దుకాణాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్ల అమ్మాకాలను నిషేధించారు. తిరుమల కొండ మీద వ్యాపారం చేస్తున్న వారు కూడా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని సూచించింది. ఆలయాల్లో ప్రసాదాల పంపిణీలోనూ చిన్నచిన్న ప్లాస్టిక్ వినియోగాన్ని బ్యాన్ చేశారు. చివరకు షాంపులు కూడా తిరుమలలో నిషేదించారు. ఎవరైన ప్లాస్టిక్ వస్తువులు వినియోగించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలిపింది. మరి.. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.