ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల గుర్తుండేళ్ల ఏడాది క్రితం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఆలయం నిర్మించిన విషయం తెలిసింది. ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరిస్తూ ఎంతో అద్భుతంగా ఆ గుడిని నిర్మించారు. అప్పట్లో అందరిని ఆకట్టుకున్న ఈ నవరత్నాల గుడి.. తాజాగా మరొసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేవుళ్లకు ఆలయాలు కట్టడం సర్వసాధారణం. అంతేకాక ఆలయాలు నిర్మించి దేవతామూర్తులను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తుంటారు. అభిమాన హీరో, హీరోయిన్లకు, రాజకీయ నేతలకు కూడా ఆలయాలు నిర్మించిన ఘటనలు అనేకం చూశాం. అయితే ప్రజల కష్టాలను తీరుస్తూ అభివృద్ధి పథం వైపు నడిపించే సంక్షేమ పథాలకు ఆలయం కట్టించడం అందర్ని ఆకట్టుకుంటుంది. ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం నవరత్నాల పేరుతో అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తుంది. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిచండంలో మాత్రం వెనుకడుగు వేయలేదు. అలానే సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ నవరత్నాలు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండేందుకు ఏడాది క్రితం శ్రీకాళహస్తీ ఎమ్మెల్యే బి.మధుసూదన్ రెడ్డి ఓ గుడిని నిర్మించారు. ఆ ఆలయానికి జగనన్న నవరత్నాల నిలయం అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రజల సంక్షేమం కోసమే పరితపించారు. నవరత్నాల పేరుతో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్నా కూడా ప్రజల సంక్షేమ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. అలా ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజల గుండెల్లో ఉండేలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. అయితే శ్రీకాళహస్తీ ఎమ్మెల్యే బి. మధుసూదన్ రెడ్డి నవరత్నాలు కోసం ఏకంగా ఓ గుడి కట్టించారు. ఆ ఆలయానికి జగనన్న నవరత్నాల నిలయం అని పేరు పెట్టారు. ఈ ఆలయంలో నవరత్నాలో అని పథకాల గురించి వివరిస్తూ ఒక్కొక్క పథకం ఒక్కొక్క పిల్లరుగా ఏర్పాటు చేశారు.
దీనిపై రెండు చేతల మధ్యలో ఒక్కొక్క పథకం పేరు ప్రస్తావిస్తూ రూపొందించారు. మూడు అంతస్తులుగా ఈ నవరత్నాల ఆలయాన్ని నిర్మించారు. గుడిపైన ప్రత్యేకంగా అద్దాల గోపురం నిర్మించారు. మధ్యలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రాన్ని రాగి ఆకులపై ఏర్పాటు చేశారు. ఏపీ చిత్రాన్ని కూడా ఓ ఫ్రేమ్ లో ఉంచారు. ఈ నవరత్నాల గుడిని ఏడాది క్రితం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రారంభించారు. జగనన్న నవరత్నాల ఆలయం అందరిని విశేషంగా ఆకట్టుకుంది. రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ ఆలయం తాజాగా మరోసారి వైరల్ అవుతోంది. మరి.. వైరల్ అవుతున్న శ్రీకాళహస్తీలోని నవరత్నాల గుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.