నాయకుడు పర్యటన నిమిత్తం బయటకు వెళ్లాడంటే.. ఆయన వెంట మంది మార్బాలం, పదుల కొద్ది వాహనాలు బయలుదేరాల్సిందే. ఇక ఈ వీఐపీల కాన్వాయ్‌లు వెళ్తుంటే.. జనాలను రోడ్డు మీద ఆపేస్తారు. దీనిపై సమాజంలో పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అంబులెన్స్‌లను కూడా ఆపేస్తారు. ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టడం కొందరు నాయకులకు ఇష్టం ఉండదు.
ఈ కోవలోకే వస్తారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తన పర్యటన సందర్భంలో సామాన్య ప్రజలకు, అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకూడదని ముఖ్యమంత్రి జగన్ గతంలోనే చెప్పారు. పోలీసులకు కొన్ని సూచనలు చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం కాన్వాయ్ గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళుతున్న సమయంలో ఆ సూచనల్ని పాటించారు అధికారులు. సీఎం జగన్ కాన్వాయ్ వెళుతున్న సమయంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి: MLA బాలకృష్ణకు ఏపీ ప్రభుత్వం షాక్! డిప్యూటేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు!
మంగళవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్ తాడేపల్లి నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ గన్నవరం దగ్గర జాతీయ రహదారి నుంచి విమానాశ్రయంలోకి ప్రవేశించేంది. అదే సమయానికి విజయవాడ వైపు వెళ్తున్న 108 అంబులెన్స్ అక్కడికి చేరుకుంది.. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. వాహనాలను క్లియర్ చేసి 108 వాహనాన్ని ముందుకు పంపారు. ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ మధ్యలో నుంచి అంబులెన్స్ వెళ్లింది. అనంతరం సీఎం కాన్వాయ్ ఎయిర్‌పోర్టులోకి చేరుకుంది.
ఇది కూడా చదవండి: AP పథకాలపై తమిళనాడు సీఎం ప్రశంసలు!
గతంలో కూడా ఇలానే సీఎం కాన్వాయ్ మధ్యలో నుంచి 108 వాహనానికి దారి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తన పర్యటన జరుగుతున్న సమయంలో సామాన్యులు ఎవరూ ఇబ్బందిపడకూడదని.. కాన్వాయ్ వెళుతున్న సమయంలోనేనైనా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గతంలో ముఖ్యమంత్రి పోలీసులకు సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 108 వాహనానికి దారి ఇచ్చిన సీఎం జగన్ సింప్లిసిటీని ప్రజలు ప్రశంసిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: భూం భూం బీర్, పవర్‌స్టార్ బీర్లు తెచ్చింది చంద్రబాబే: సీఎం జగన్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.