ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. సాయం కోరిన కుటుంబాలకు అండగా నిలిచారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. సాయం చేయండంటూ తన దగ్గరకు వచ్చిన కుటుంబాలకు ఆయన అండగా నిలిచారు. పల్నాడు జిల్లా, చిలుకలూరిపేట లింగంగుంట్లలో ‘ఫ్యామిలీ డాక్టర్’ పథకం ప్రారంభోత్సవంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను కలసిన కొందరు బాధితులు తమ అనారోగ్య సమస్యలను వివరించారు. తమకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఆర్థిక సాయంతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించాలని జగన్‌ను బాధితులు వేడుకున్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. బాధితులను వెంటనే ఆదుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్‌ను ఆదేశించారు.
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ శివశంకర్ బాధితులను తన కార్యాలయానికి పిలిపించి వారితో మాట్లాడారు. బాధితులకు తక్షణ సాయంగా ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఐదుగురికి కలిపి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. బాధితులందరూ పలు అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న వారే కావడం గమనార్హం. చికిత్సకు డబ్బుల్లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి అడిగిన వెంటనే సాయం చేయడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ తన గొప్ప మనసును చాటుకున్నారు. దీంతో ప్రజలతో పాటు రాజకీయాలకు అతీతంగా నేతలు జగన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.