గత కొన్ని రోజులుగా ఆంధ్రపదేశ్ లో నడుస్తోన్న పీర్సీ వివాదానికి తెర పడింది. ప్రభుత్వ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్ ని నిర్ణయిస్తూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలానే ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నారు.
పెండింగ్ డీఏలు జనవరి నుంచి చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2020, ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ వర్తింస్తుందని తెలిపారు. జూన్ 30 లోపు కారుణ్య నియామకాలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించినట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు జూన్ 30 లోపు ప్రబేషనరీ డిక్లరేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.