విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో వాటాలను దక్కించుకునేందుకు బిడ్డింగ్ వేయాలని సర్కార్ నిర్ణయించుకుంది. ఈక్రమంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమపై కేసీఆర్ కు కీలక నివేదిక అందింది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ గా నడుస్తున్న ఇష్యూల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటి. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థను కేంద్రం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమవుతుంది. ఎక్కువ నష్టాలు వస్తుందనే కారణంగా చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు సంస్థల పరం చేసేందుకు సిద్ధమైంది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏపీలోని అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. అలానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. అంతేకాక విశాఖ స్టీల్ ప్లాంట్ లో వాటాలను దక్కించుకునేందుకు బిడ్డింగ్ వేయాలని కూడా కేసీఆర్ సర్కార్ నిర్ణయించుకుంది.
కేంద్ర ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తున్న పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటి. అందుకే కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ సర్కార్ కు నిత్యం సైలెంట్ వార్ నడుస్తోంది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలను కేసీఅర్ సర్కార్ వ్యతిరేకిస్తుంది. తెలుగు రాష్ట్రానికి చెందిన ప్రధాన ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణను చేయాలనే నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ లో వాటాలు కూడా దక్కించుకోవాలని కేసీఆర్ సర్కారు బిడ్డింగ్ వేయాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో పలువురు సింగరేణి అధికారులను విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటనకు పంపింది. కేసీఆర్ ఆదేశాలతో సింగరేణి అధికారులు రెండు రోజుల పాటు విశాఖ ఉక్కు పరిశ్రమలో పర్యటించారు. అక్కడి ఉద్యోగులను, కార్మిక సంఘాలతో భేటీ అయ్యారు. అనంతరం అక్కడ సేకరించిన సమాచారంతో సింగరేణి అధికారులు ఓ నివేదికను సిద్ధం చేశారు. ఈ రిపోర్ట్ ను నేడు సీఎం కేసీఆర్ కు అధికారులు అందించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా పెద్దదని.. నిధులు సమకూరిస్తే లాభాల బాట పట్టే అవకాశం ఉందని ఆ నివేదికలో పొందుపరిచనట్లు సమాచారం.
ముడి సరకు కొరత స్టీల్ ప్లాంట్ కు ఉందని.. ముడి సరకు సప్లయ్ చేసి స్టీల్ ఉత్పత్తులను తీసుకునే సంస్థలు ముందు వస్తే సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు గుర్తించినట్లు సమాచారం. మరి.. సింగరేణి అధికారులు ఇవ్వనున్న నివేదిక పరిశీలించిన తరువాత కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి. సింగరేణి అధికారుల నివేదిక అంటూ వైరల్ అవుతున్న ఆ సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.