నేడు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ మండల కేంద్రాల్లోనూ సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని టీఆర్ఎస్ కమిటీలు సన్నాహాలు పూర్తిచేశాయి.
ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ, ముఖ్య కూడళ్లలో అన్నదాన కార్యక్రమాలు, వృద్ధాశ్రమాల్లో బట్టల పంపిణీ, అనాధాశ్రమాల్లో అన్నదానం, పిల్లకు దుస్తుల పంపిణీ, రోడ్డు పక్కనే ఆశ్రయం లేని వారికి దుప్పట్ల పంపిణీ, రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ సీఎం కేసీఆర్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. మొక్కలు, కూరగాయలు, పువ్వులతో సీఎం కేసీఆర్ అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించారు. ఏపీ ప్రజలు కూడా వెన్నంటే ఉన్నారని సందేశం అందించారు.
ఇది చదవండి: సీఎం KCR కు పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్..!
ఇక కరీంనగర్ 25వ డివిజన్ కార్పొరేటర్ ఎడ్ల సరిత, ఆమె భర్త ఎడ్ల అశోక్‌లు కాస్తా వెరైటీ ప్రోగ్రాం ఎంచుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా డివిజన్ లోని పేదలకు కోడి పుంజులను పంపిణీ చేశారు. ప్రతి కోడికి సీఎం ఫోటోలను జత చేసి మరీ కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తానికి తమ ప్రియతమ నాయకుడి పుట్టిన రోజు వేడుకలు ఎంతో వినూత్నంగా జరుపుకుంటున్నారు.
pic.twitter.com/rqOVGn0LfW
— bade raja (@baderaja04) February 17, 2022