గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని అధికార, ప్రతిపక్ష నేతలు ఇప్పటి నుంచి రక రకాల వ్యూహాలు రచిస్తున్నారు. అధికార పక్షం తాము చేసిన అభివృద్ది పనుల గురించి ప్రజలకు తెలియజేస్తూ గడప గడపకు ప్రభుత్వం అంటూ ముందుకు వెళ్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాము చేసిన అభివృద్ది పనుల గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. ఈ మద్యనే వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల జరిగిన మేలును తెలుసుకునేందుకు “గడప గడపకు మన ప్రభుత్వం” అనేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు తమ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు వెళ్లి.. ప్రజల నుంచి ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాలను సేకరిస్తున్నారు. వీటిపై ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు సీఎం జగన్. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు.
నేటి ఉదయం ఆయన వ్యాయామం చేస్తున్న సమయంలో కాలు బెణికింది. సాయంత్రం వరకు ఆ నొప్పి తీవ్రం కావడంతో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. గతంలో కూడా జగన్ కాలి నొప్పితో తీవ్రంగా బాధపడ్డారు. తాజాగా మరోసారి ఆయన కాలికి గాయం కావడంతో డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఎలాంటి ప్రయాణాలు చేయడానికి వీలు తేదని ఆయనకు డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో రేపటి ఒంటిమిట్ట పర్యటనను రద్దు చేశారు అధికారులు. ఈ మేరకు సీఎం కార్యాలయం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌కు కాలినొప్పి*. ఉదయం ఎక్సర్‌సైజ్ చేస్తున్న సమయంలో బెణికిన కాలు. సాయంత్రానికి పెరిగిన నొప్పి. గతంలో ఇలానే కాలికిగాయం. చాలారోజులపాటు ఇబ్బందిపడ్డ ముఖ్యమంత్రి. ప్రయాణాలు రద్దుచేసుకోవాలని డాక్టర్ల సూచన. రేపటి ఒంటిమిట్ట పర్యటనను రద్దుచేసిన అధికారులు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 4, 2023