ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్నారు. ముఖ్యంగా తన పరిపాలనలో ప్రజాసంక్షేమానికే పెద్ద పీఠ వేశారు. ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూనే, ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకొచ్చారు. నవరత్నాల పేరుతో రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు సీఎం జగన్. ఈ క్రమంలోనే ‘జగనన్న చేదోడు’ పథకం కింద లబ్దిదారులకు మూడవ విడత సాయాన్ని విడుదల చేశారు. సోమవారం పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన కార్యక్రమంలో ఈ సాయాన్ని విడుదల చేశారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్ డీపీ లో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో ఉందని, దేశానికే ఆదర్శంగా దూసుకెళ్తుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
పల్నాడు జిల్లా వినుకొండలో ‘జగనన్న చేదోడు’ పథకంలో భాగంగా సభ నిర్వహించారు. ఈ సభ నుంచి జగనన్న చేదోడు పథకంలో భాగంగా మూడవ విడత సాయాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతీ పేద కుటుంబానికి ఎంతో మేలు జరుగుతోంది. అలానే ప్రతి నిరుపేదకు మరింత మేలు చేసేలా మన అందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ వచ్చింది. వెనకబడిన కులాలను, వర్గాలను.. బ్యాక్ బోన్ లా మారుస్తామని మా ఇచ్చాం. అలానే లంచాలకు తావులేని వ్యవస్థ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఎటువంటి వివక్షత చూపకుండా పారదర్శకంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందజేస్తున్నాం.
వరుసగా ఈ మూడేళ్ల కాలంలో 3.3 లక్షల మందికి మంచి చేస్తూ.. నేడు రూ.330 కోట్లు నేరుగా ఖాతాల్లో వేస్తాము. ఇక రాష్ట్ర అభివృద్ధి విషయానికి వస్తే.. ప్రతి పక్షాలు… మరో శ్రీలంకతో పోల్చడం దారుణం. నేడు మన రాష్ట్రం దేశంలోనే జీఎస్డీపీ లో తొలిస్థానంలో ఉన్నాము. జీఎస్డీపీ ప్రకారం.. మన అభివృద్ధి రేటు 11.43 శాతంతో మొదటి స్థానంలో ఉందని గర్వంగా చెప్తున్నాను. దేశానికే ఆదర్శంగా మన రాష్ట్రం పరిగెడుతోంది. ఇలా రాష్ట్రం పరిస్థితుల్లో ఉంటే.. గిట్టనివాళ్లు రాష్ట్రం.. మరో శ్రీలంక అయిపోతోంది అంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు” అని సీఎం జగన్ అన్నారు.
ఇదంతా గమనించాలని ఏపీ ప్రజలకు సీఎం పిలుపు నిచ్చారు. ప్రతి రంగంలోనూ ముందుకు దూసుకెళ్లున్నప్పుడే ఇలాంటి ఘనతలు సాధ్యమవుతుందన్నారు. రైతులు, అక్కాచెల్లెమ్మలు, సోదరులకు.. ఇలా అందరికీ సంక్షేమ పథకాల ద్వారా సాయం, చేయుత ఇస్తున్నాము. ఈ సంక్షేమ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలు వాళ్లకాళ్ల మీద వాళ్లు నిలబడతూ రాష్ట్రాన్ని ముందుకు పరిగెట్టిస్తున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మరి.. సీఎం చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.