పశ్చిమ గోదావారి జిల్లాలో ఘోర బస్సు బోల్తా ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటికి 9 మంది మరణించినట్లు తెలుస్తుంది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది మృతదేహాలను బయటకు తీస్తున్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఇక ఈ ప్రమాదంలో మరణించిన ఒక్కో కుటుంబానికి గాను రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్ష్యులు తెలుపుతున్నారు. కాస్త జాగ్రత్త వహించి ఉంటే ఇంత నష్టం జరిగుండేది కాదని స్థానికులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్సు బోల్తా ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.