బుధవారం ప్రకాశంలో జిల్లా మార్కాపురంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. అలానే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద.. 4.39 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని జమ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా మార్కాపురంలోభారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎస్‌వీకేసీ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదికపై సీఎం జగన్ ప్రసంగించారు. అలానే ఈ సభలో మాజీ మంత్రి బాలినేనికి సీఎం జగన్ ప్రత్యేక గౌరవం చూపించారు.
బుధవారం ప్రకాశంలో జిల్లా మార్కాపురంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. అలానే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద.. 4.39 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని జమ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా మార్కాపురంలోభారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎస్‌వీకేసీ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదికపై సీఎం జగన్ ప్రసంగించారు. అలానే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. అయితే వైఎస్సాఆర్ ఈబీసీ నేస్తం నిధులు విడుదలే చేసే సమయంలో ఓ అరుదైన దృశ్యం జరిగింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వయంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చేయిని బటన్ నొక్కించారు. అందరు కాసేపు ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. వైఎస్సాఆర్ ఈబీసీ నేస్తం కింద నిధులు విడుదల చేసేందుకు మార్కాపురంలో వచ్చారు. స్థానిక ఎస్వీకేపీ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఈ నిధులను విడుదల చేశారు. ఈ సభకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షంపై తీవ్ర స్థాయిలో విరుచపడ్డారు. మన ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా? ఆలోచించాలని ప్రజలను కోరారం. అలానే ఫేక్ ఫోటోలతో మన ప్రభుత్వంపై బురద జల్లె ప్రయత్నం ప్రతిపక్ష పార్టీ నాయకులు చేస్తున్నారని సీఎం అన్నారు. ఈబీసీ నేస్తం కింద.. 4,39, 068 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని జమ చేశారు సీఎం జగన్.
అయితే ఈ సభలో ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. వైఎస్సాఆర్ ఈబీసీ నేస్తం కింద నిధులు విడుదల చేసే సమంయలో సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చేయిని స్వయంగా పట్టుకుని బటన్ నొక్కించారు. ఈ ఒక్క సంఘటనతో మాజీ మంత్రికి సీఎం జగన్ వద్ద ఉన్న ప్రాధాన్యత ఎంటో అర్ధమైంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీని స్థాపించిన నాటి నుంచి ఆయన వెంటనే నడిచిన వారిలో బాలినేని శ్రీనివాస రెడ్డి ఒకరు. జగన్ కోసం తన ఎమ్మెల్యే రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లి గెలిచారు. అలా జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఆయన వెంటనే ఉన్నాడు. అందుకే 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బాలినేనికి మంత్రివర్గంలో చోటు దక్కింది.
రెండేళ్ల తరువాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయన చోటుకోల్పోయారు. ఈ నేపథ్యంలో కొంతకాలంలో బాలినేని అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అధిష్టానం వద్ద ఆయనకు ప్రాధాన్యత తగ్గిందంటూ వార్తలు వినిపించాయి. అలానే బుధవారం మార్కాపురంలో జరిగిన సీఎం పర్యటనలో కూడా బాలినేనికి చేదు అనుభవం ఎదురైంది. అయితే సభా వేదికపై సీఎం స్వయంగా బాలినేని చేత బటన్ నొక్కించారు. ఆ విధంగా మాజీ మంత్రి బాలినేనికి సీఎం జగన్ ప్రత్యేక గౌరవం ఇచ్చారు. మరి.. సీఎం జగన్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.