పోలీసు అధికారులపై విరుచుకుపడుతున్న రాజకీయ నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీలో ఇలాంటి సంఘటనలు ఎక్కువవుతున్నాయి. గతంలో నందిగాం సురేష్, సీదిరి అప్పలరాజు వంటి నేతలు పోలీసులపై చిందులు తొక్కగా తాజాగా ఆ జాబితాఆలోకి మంత్రి పేర్ని నాని చేరారు. తమాషాలు చేస్తున్నారా.. మర్యాదగా ఉండదు అంటూ పోలీసులపై రెచ్చిపోయారు. ఆ వివారాలు..
పోలవరం పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కలిసి సీఎం జగన్ పోలవరంలో పర్యటించారు. కేంద్రమంత్రి, సీఎం పర్యటన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ పరిసరాల్లో భారీ స్థాయిల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి.. ప్రాజెక్టు సమీపంలోకి ఎవరిని అనుమతించలేదు. సీఎం పర్యటన నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న పేర్ని నాని.. పోలవరం ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నారు. మంత్రి వాహనం అడ్డుగా ఉందని.. దాన్ని తీయాలని చెప్పడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
ఈ క్రమంలో పేర్ని నాని అక్కడున్న పోలీసు అధికారిని ఉద్దేశిస్తూ.. ‘‘ఈ కార్లన్ని ఎవరివి.. ఏం తమాషాలు చేస్తున్నారా.. కారు తీయమన్నది ఎవరు.. ఎస్పీ, డీఐజీ కార్లు ఇక్కడెందుకు ఉంటాయి.. నాకంటే వాళ్లు ఎన్ని డెసిగ్నేషన్లు తక్కువ.. మర్యాదగా ఉండదు’’ అంటూ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలను కూడా అనుమతించకపోవడంతో తీవ్ర అసహనానికి లోనైన మంత్రి ఇలా పోలీసులపై తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. అనంతరం పోలీసులు నుంచి ఆ మేరకు అనుమతి లభించడంతో ఆయన శాంతించారు. మంత్రి పేర్ని నానిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.