సామాన్యుల సంగతి ఎలా ఉన్నా సరే.. సినీ, క్రీడా, రాజకీయ సెలబ్రిటీలు మాత్రం.. ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. వృత్తి జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను, సవాళ్లను ఎదుర్కొవాలంటే.. ముందు మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండాలి. లేదంటే అది మైండ్ మీద ప్రభావం చూపి.. లైఫ్ స్టైల్‌ని దెబ్బ తీస్తుంది. ఇందుకోసం చాలా మంది నేతలు ప్రత్యేక డైట్‌ని కూడా ఫాలో అవుతుంటారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టే.. వాళ్లు ఎప్పుడు ప్రశాంతంగా కనిపిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విషయానికి వస్తే.. ఆయన ముఖం మీద చిరునవ్వు ఎన్నటికి చెరగదు. విపక్షంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికి.. ఎలాంటి సమయంలో అయినా సరే.. ఆయన ముఖం మీద చిరునవ్వు చెరగదు. పైగా చాలా ఫిట్‌గా, యంగ్‌గా కనిపిస్తారు. మరి జగన్ ఇంత హుషారుగా ఉండటానికి కారణం ఏంటి.. ఆయన ఏం డైట్ ఫాలో అవుతారు వంటి వివరాలు..
జగన్ మొదటినుంచి ఫిట్‌నెస్‌కి అధిక ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఇక జగన్ ఎప్పుడు చెరగని చిరునవ్వుతో ఎలా ఉండగల్గుతున్నారు.. నిత్యం సమీక్షలు, సమావేశాలు అంటూ క్షణం తీరిక లేకుండా గడిపే ఆయన ఎప్పుడు ఒకేలా.. ప్రశాంతంగా ఎలా ఉండగల్గుతున్నారు.. ఆయన అలసిపోరా అని అభిమానులతో పాటు నేతలు కూడా చర్చించుకుంటారు. అయితే జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి స్వయంగా డాక్టర్ కావడంతో.. ముందు నుంచి ఇంట్లో అందరికి ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ. పోషకాహారం, యోగా వంటి వాటిని తప్పకుండా పాటిస్తారు. అందుకే ఎంత ఒత్తిడి ఉన్నా సరే.. ప్రశాంతంగా చెరగని చిరునవ్వుతో కనిపిస్తాడు.
ఇక సీఎం జగన్ చదువులు నిమిత్తం హైదరాబాద్, బెంగళూరుల్లో ఉన్నా అక్కడి ఆహారం కంటే.. సీమ రుచులనే ఎక్కువగా ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా ఆయనకు మామిడి కాయ పులిహోర అంటే ఎక్కువ ఇష్టమట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంతకుముందు ఓదార్పు యాత్ర చేసే సమయంలో ఇలా ఎప్పుడు విజయవాడ వచ్చినా కచ్చితంగా ఆయన భోజనంలో మామిడికాయ పులిహోర తప్పకుండ ఉండేలా చూసుకునేవారట. ఇక సీఎం జగన్ దినచర్య ఇలా ఉంటుంది. ఉదయం 4.30గంటలకి ఆయన రోజు మొదవుతుంది. లేచిన తర్వాత గంట పాటు యోగా, జిమ్ వంటివి చేస్తారు. ఐదున్నరకు కాసేపు పేపర్ చదవడంతో పాటు కొన్ని ముఖ్యమైన అంశాలపై సూచనలను నోట్ చేసుకుంటార. ఆ టైమ్ లో కేవలం టీ మాత్రమే తాగుతారు.
ఇక ఉదయం ఏడు గంటల సమయంలో ఏదో ఓ పళ్ల రసం తీసుకుంటారు. ఉదయం టిఫిన్ చేయరు. కొన్ని డ్రైఫ్రూట్స్ మాత్రమే తింటారు. పాదయాత్ర సమయంలోనూ ఆయన బ్రేక్‌ఫాస్ట్‌కు దూరంగా ఉన్నారు. ఇక సీమవాసులు అమితంగా ఇష్టపడే చిత్రాన్నమంటే జగన్‌కు కూడా ఎంతో ఇష్టమట. ఇక మధ్యాహ్నం భోజనం సమయంలో అన్నం బదులు రెండు పుల్కాలు మాత్రమే తీసుకుంటారట. అప్పుడప్పుడు రాగిముద్ద, మటన్ కీమాను మధ్నాహ్నం భోజనంలో భాగంగా తీసుకుంటారు. ఇక కుండపెరుగు లేకుండా ఆయన భోజనం ముగించరని తెలిసినవారు చెప్తుంటారు. అలానే వివిధ అంశాలు, శాఖలపై సమీక్షలు జరిపే సమయంలో చాక్లెట్స్ తింటారట. సాయంత్రం టీ మాత్రమే తీసుకుంటారు. పల్లీలు, మొక్కజొన్న పొత్తులంటే సీఎంకు ఇష్టం.. వీలుదొరికినప్పుడు వీటిని తీసుకుంటారట. పళ్లరసాలకు జగన్ ప్రాధాన్యమిస్తారు
ఇక వీకెండ్‌లో పూర్తిగా కుటుంబంతోనే గడిపే జగన్.. ఆదివారం రోజు మాత్రం బిర్యానీ, చేపల పులుసు, మటన్ వంటి నాన్ వెజ్ వంటలు భోజనంలో ఉండేలా చూసుకుంటారు. అయితే జగన్ ఎన్నిరకాల వంటలు ఇష్టపడినా మితంగానే తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. యోగా, జిమ్ ద్వారా ఒత్తిడి దరిచేరనీయకుండా పాజిటివ్‌గా ఆలోచించడమే ఆయన ఆరోగ్యరహస్యమని సన్నిహితలు చెబుతుంటారు.