ఏపీ రహదారులకు మహర్దశ.. ఇవాళ ఏకంగా 31 కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి శంకు స్థాపన చేసింది ఏపీ సర్కార్. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు శంకుస్థాపనలో పాల్లొన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి. మొదటగా బెజవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ 2 ప్రారంభించారు సిఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. . రూ.10,400 కోట్లతో రహదారుల పనులకు శంకుస్థాపన చేశామని సిఎం జగన్ వెల్లడించారు.
ఇది చదవండి: ద్విచక్రవాహనదారులకు షాకింగ్ న్యూస్..!
కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. గడ్కరీ గారి సహకారంతో బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ వేగంగా పూర్తయిందని వెల్లడించారు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి. రూ. 20 వేల కోట్ల విలువైన 51 ప్రాజెక్టులకు ముందడుగు పడుతోందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, నితిన్ గడ్కారీకి ధన్యవాదాలు చెప్పారు.