హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అందరికీ గుర్తొచ్చేది 108 అంబులెన్సే. ప్రమాదాలు అయినప్పుడు కూడా తొలుత ఈ నంబర్‌కే కాల్ చేస్తుంటారు. అయితే అంబులెన్స్ ఎంతసేపట్లో ఘటనా స్థలానికి వస్తుందనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ సమస్యకు చెక్ పెడుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఎక్కడైనా ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే వెంటనే 108కు కాల్ చేస్తాం. అయితే అది ఏ సమయానికి సంఘటనా స్థలానికి వస్తుందనేది చెప్పలేని పరిస్థితి. అంబులెన్స్ రాక కోసం బాధితులు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ట్రాకింగ్ విధానాన్ని ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాల కల్పనపై పెద్ద ఎత్తున దృష్టి సారించిన జగన్ సర్కారు.. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. ఈ క్రమంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో 108 అంబులెన్స్‌ల్లో ట్రాకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఓలా, ఊబర్, రాపిడో లాంటి వెహికిల్స్‌ను ట్రాక్ చేసే తరహాలోనే.. 108 వాహనాలనూ ట్రాక్ చేసే పద్ధతిని ఏపీ వైద్య శాఖ ప్రవేశపెడుతోంది.
ఈ ట్రాకింగ్ విధానం వల్ల 108 వాహనం ఎక్కడ వరకు వచ్చింది? ఎంతసేపట్లో తమ దగ్గరకు వస్తుందనే విషయాలను బాధితులు ట్రాక్ చేసే వీలుంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రయల్ రన్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసిందని తెలుస్తోంది. అంబులెన్స్‌ల ట్రాకింగ్ సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆరోగ్య శ్రీ మీద నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ అంబులెన్స్ వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్ గురించి ఆఫీసర్స్‌ను అడిగి తెలుసుకున్నారు. త్వరలో ట్రాకింగ్ సిస్టమ్‌ను అమలు చేస్తామని రజిని చెప్పారు. అంబులెన్స్ ఎక్కడుందో తెలుసుకునేందుకు మొబైల్స్‌కు రూట్ మ్యాప్ లింక్‌ను పంపేందుకు ప్రయోగాత్మకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరి.. అంబులెన్స్ ట్రాకింగ్ విధానం ప్రజలకు ఎంతవరకు ఉపయోగడపతుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.