బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం.. బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం శ్రీకాకుళంలో పర్యటించారు. జిల్లాలోని మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలానే నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం ఉంటానని సీఎం వ్యాఖ్యానించారు.
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచి పాలన సాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్య నగరం విశాఖ అని సీఎం అన్నారు. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానంటూ సీఎం కీలక ప్రకటన చేశారు. బుధవారం శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు.
ఉదయం పది గంటలకు శ్రీకాకుళం జిల్లాకు చేరుకుని వరసగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలానే నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణం, హిర మండలంలో వంశధార లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలతో శ్రీకాకుళం జిల్లా ముఖచిత్రం మారిపోతుందన్నారు.
గత పాలకులు శ్రీకాకుళం జిల్లాను నిర్లక్ష్యం చేశారని, ఇకపై మూలపేట.. అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మానప్రసాదరావు, గుడివాడ అమరనాథ్ తో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా పాల్గొన్నారు. మరి.. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే నివాసం ఉంటానన్న సీఎం వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.