గడీలలో నిజాం పాలకుల అకృత్యాలకు నిరసనగా గళమెత్తి.. అసహాయులకు అండగా ఆయుధం పట్టిన మల్లు స్వరాజ్యం మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మల్లు స్వరాజ్యం పోరాట యోధురాలిగానే కాకుండా సామాజిక, రాజకీయ సమస్యలపై అనేక పోరాటాలు చేసిన ఉద్యమకారిణి అంటూ సీఎం జగన్ నివాళులర్పించారు. నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి మల్లు స్వరాజ్యం జీవించారంటూ సీఎం జగన్ కొనియాడారు. ఆవిడ కుటుంబానికి అండగా ఉంటామంటూ జగన్ ప్రకటించారు. మల్లు స్వరాజ్యం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
ఇదీ చదవండి: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. రెండేళ్లలో ఇదే తొలిసారి..
మల్లు స్వరాజ్యం మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన తుంగతుర్తి అందించిన చైతన్యంతో ఎదిగిన మహిళా యోధురాలు మల్లు స్వరాజ్యం అంటూ కేసీఆర్ కొనియాడారు. ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన ఆమె జీవన గమనం- గమ్యం రేపటి తరాలకు స్ఫూర్తిదాయం అన్నారు. అలాంటి ఓ మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మల్లు స్వరాజ్యం కొద్దికాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. చికిత్స కోసం బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.