గత కొంత కాలంగా ఏపిలో సినిమా టిక్కెట్ల వ్యవహారంపై రగడ కొనసాగుతుంది. ఒక దశలో సినిమా టికెట్ల వ్యవహారం ఏపీ ప్రభుత్వానికి, తెలుగు సినీ పరిశ్రమకు మధ్య అగాధాన్ని పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన ఆయన సీఎం కుటుంబంతో కలిసి భోజనం చేశారు. తర్వాత మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ.. సినీ రంగ సమస్యలపై జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.
ఇది చదవండి: లక్ష్మీగణపతి ఫిలిమ్స్ దెయ్యాలకోట! డబ్బింగ్ ఆర్టిస్ట్ గుర్తుందా?
జగన్ ఇచ్చిన భరోసాతో తనలో ధైర్యం వచ్చిందని చెప్పారు. ఎవరూ అభద్రతాభావానికి గురి కావద్దని, అందరూ సంయమనంతో వ్యవహరించాలని కోరారు. ఈ విషయం పై ఏపి మంత్రి పేర్ని నాని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవితో జరిగినవి సంప్రదింపులు కావు.. కుశల ప్రశ్నలు మాత్రమే అన్నారు మంత్రి పేర్ని నాని. సీఎం భోజనానికి పిలిచారు… చిరంజీవి వెళ్లారని చెప్పారు మంత్రి. జగన్ – చిరంజీవి సమావేశంలో తాను లేనని అన్నారు.
ఇది చదవండి : మహేశ్ బాబు.. చిన్నారుల హార్ట్ ఆపరేషన్ల వెనకున్న కన్నీటి కథ!
సినిమా టికెట్లకు సంబంధించిన సంప్రదింపులు సచివాలయంలో జరుగుతాయి కానీ.. ఇంట్లో జరుగుతాయా అని ప్రశ్నించారు. వారిద్దరు మాట్లాడుకున్న విషయాలన్నీ తమకు చెప్పలేదని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.