పార్టీ కోసం కష్టపడిన ఓ నేత కుటుంబానికి వైసీపీ అండగా నిలబడింది. తప్పక సాయం చేస్తామంటూ ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. మిగిలిన వివరాలు మీ కోసం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోమారు తన మంచి మనసు చాటుకున్నారు. వైసీపీ కోసం కష్టపడిన వారికి అన్నీ తానై అండగా నిలబడే జగన్.. మరోసారి దాన్ని నిజం చేశారు. పార్టీ కోసం అహర్నిషలు శ్రమించిన ఓ నేత చనిపోతే, ఆ కుటుంబానికి ఆయన అండగా ఉన్నారు. వారికి ఏమీ కాదంటూ భరోసా ఇచ్చారు. గతంలో వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ భారీ ఆర్థిక సాయాన్ని అందజేశారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని తెలగాయపాలెం గ్రామానికి చెందిన సిద్దెల కోటేశ్వరరావు అనే వైసీపీ నేత గతేడాది కన్నుమూశారు. కోటేశ్వరరావు మృతి చెందిన ఘటనపై వైసీపీ నేతలు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని చాలా మంది పరామర్శించారు. కోటేశ్వరరావు కుటుంబానికి వెఎస్సార్సీపీ అండగా ఉంటుందని పార్టీ అధినేత, సీఎం జగన్ హామీ ఇచ్చారు.
సిద్దెల కుటుంబానికి తాము ఉన్నామని పార్టీ ఆఫీస్ సెంట్రల్ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి అప్పట్లో ప్రకటించారు. హామీ ఇచ్చిన ప్రకారమే కోటేశ్వరరావు కుటుంబానికి రూ.5 లక్షలు అందజేశారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మాట ఇస్తే వెనక్కి తగ్గరని గణేష్ ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకున్నందుకు జగన్‌తో పాటు వైసీపీ అడ్వైజర్ సజ్జల రామకృష్ణా రెడ్డి, అప్పిరెడ్డికి బండ్ల గణేష్ థ్యాంక్స్ చెప్పారు. అసెంబ్లీ సెషన్స్‌లో బిజీగా ఉండటంతో బాధిత కుటుంబానికి ఈ మొత్తాన్ని అందజేయమని అప్పిరెడ్డి తనకు చెప్పారని ఆయన పేర్కొన్నారు. దీంతో సిద్దెల కుటుంబానికి రూ.5 లక్షలు అందజేశానని బండ్ల గణేష్ ట్వీట్లో చెప్పుకొచ్చారు.
That financial assistance of Rs. 5,00,000/- has been extended by the YCP party chief and honourable CM Shri @ysjagan YSRCP Party Central office in charge Shri Appireddy announced last year that the party would stand by the family of late Siddela Koteswara Rao, Telagayapalem..2
— BANDLA GANESH. (@ganeshbandla) March 16, 2023