ఇప్పటికే పెరుగుతున్న ఎండలు దృష్ట్యా తెలంగాణ సర్కార్ ఒంటి పూట బడులు ప్రకటించింది. ఇవి మొదలయ్యి పది రోజులు కూడా గడిపోయాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ లో వీటిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. దీంతో తల్లిదండ్రులు సైతం సందిగ్థంలో ఉన్నారు. దీనిపై అధికారులను వివరణ కోరగా స్పందించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు ఎండ కాస్తుంటే.. మరో వైపు వానలు కురుస్తున్నాయి. ఈ వాతావరణ మార్పులకు ప్రజలు సైతం గందర గోళానికి గురౌతున్నారు. ఎండలు మండుతున్నాయి అనుకునే లోపు వర్షాలు కురుస్తున్నాయి. పోనీ వర్షంతో ఏమన్నా వాతావరణం చల్లబడుతుండా అంటే అదీ లేదు. ఉక్కపోతతో విలవిలలాడుతున్నారు. ఇటు పెద్ద వాళ్ల సంగతి పక్కన పెడితే.. అటు బడులకు వెళ్లే చిన్నారులు సైతం మండే ఎండలకు తాళలేకపోతున్నారు. అయితే తెలంగాణాలో ఎండలను దృష్టిలో పెట్టుకుని ఒంటి పూట బడులను ప్రకటించింది. ఇప్పటికే అక్కడ ప్రారంభమయ్యి 10 రోజులు గడిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో వారి తల్లిదండ్రులు కొంత ఆందోళనకు గురయ్యారు. దీనిపై ఇంత వరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే దీనిపై అధికారులను సమాచారం కోరగా… వారు స్పందించారు.
ఇటు తెలంగాణ, ఏపీల్లో ఇప్పటికే ఇంటర్ పరీక్షలు కూడా ప్రారంభయ్యాయి. పదో తరగతి పరీక్షలు కూడా షెడ్యూల్ కాగా, వచ్చే నెలలో అవి జరగనున్నాయి. అయితే ఇంకా ఏపీలో ఒంటి పూట బడుల ఇవ్వకపోవడంపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఏపీలో ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలు జరగున్నాయి. ఆ రోజు నుండే 1 నుంచి 9 తరగతుల పిల్లలకు.. ఒంటి పూట బడులు పెట్టనున్నట్లు వివరించారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లేదా ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 వరకు పాఠశాలల నిర్వహణ జరగనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చే ఉండవచ్చునని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. మళ్లీ జూన్ 12 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అవుతాయి. ఈ సారి ఏపీలో సుమారు 45 రోజుల పాటు వేసవి సెలవులు ఉండబోతున్నాయి.
అయితే ఈ ఒంటి పూట బడికి వచ్చే విద్యార్థులకు తరగతులు అయిపోయాక మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపిస్తారు. అదేవిధంగా పిల్లలకు ఎండ వేడిమి వల్ల పిల్లలు ఇబ్బంది పడకుండా అన్ని క్లాస్ రూమ్స్‌లో ఫ్యానులు తిరిగేలా.. మంచి నీటికి సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ఇక ఏపీలో ఏప్రిల్ 3 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. హాల్‌టిక్కెట్లు ప్రస్తుం ఎస్ఎస్‌సి తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎస్ఎస్‌సి వెబ్‌సైట్‌లో స్టూడెంట్స్ తమ జిల్లా పేరు, స్కూల్ పేరు, బర్త్ డేట్ ఎంటర్ చేసి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లుు చేస్తున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి.