సమస్య ఏదైనా ఇప్పుడు ఎంతో మందికి ఆత్మహత్యే పరిష్కారం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. చదువు, ఉద్యోగం, అప్పులు, భయాలు, కుటుంబ కలహాలు కారణం ఏదైనా ఆత్మహత్య చేసుకుంటే అది తీరిపోతుంది. సమస్య వారిది అయితే వారికి పుట్టిన పాపానికి పిల్లల ప్రాణాలు తీయడం కూడా చేస్తున్నారు. అలా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళను ఈ సీఐ సార్ తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. అసలు విషయం ఏంటంటే.. జగ్గంపేట శివారు పోలవరం కాలువలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి దూకేందుకు ప్రయత్నిస్తోందని సమాచారం రాగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆ మహిళ దూకేసింది. వెంటనే సీఐ కాలువలోకి దూకి ఒడ్డునే ఉన్న బాబును బయటకు తెచ్చాడు. అమ్మాయి కోసం వెళ్లే సరికి సీఐ కూడా నీళ్లలో కొట్టుకుపోయారు. స్థానికుల సాయంతో అతికష్టం మీద పాపను కాపాడారు. ఆ మహిళ ఆచూకీ లభించలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారింది. అందరూ సీఐ సార్ ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. మరి, మీరు కూడా చూసేయండి.