ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. 1998 డీఎస్సీలో ఎంపికన వారికి నియమాక పత్రాలు అందజేసే ఫైల్ పై సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతకం చేశారు. దీంతో అప్పటివారిలో చాలా మంది ప్రభుత్వం ఉపాధ్యాయులుగా ఎంపికైనారు. అప్పట్లో డీఎస్సీకి ఎంపికైన వారిలో కొందరు ఇప్పుడు కూలీలుగా మారగా, మరికొందరు వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు. ఆ క్యాలిఫైడ్ అభ్యర్థుల జాబితా లో ఓ వైసీపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయం ఆసక్తికరంగా మారింది.
అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 1998 DSCకి ఎంపికయ్యారు. తాను టీచర్‌గా ఎంపిక కావడంపై ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రాకముందు 30 ఏళ్ల వయస్సులో డీఎస్సీ రాశానని, 1998 డీఎస్సీ వివాదాల్లోకి జారుకోవడంతో ఆ తర్వాత బీఎల్ చదివానన్నారు. అప్పట్లో ఉద్యోగంలో ఉండి ఉంటే రాజకీయలా కంటే ఉపాధ్యాయ వృత్తికే ప్రాధాన్యత ఇచ్చేవాడినని ధర్మశ్రీ తెలిపారు. అప్పుడే కనుక తనకు ఈ ఉద్యోగం వచ్చి ఉంటే ఉపాధ్యాయుడిగా స్థిరపడి ఉండేవాడినని అన్నారు. సీఎం జగన్ చొరవ వల్ల 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్న డీఎస్సీ అభ్యర్థుల కల నెరవేరిందన్నారు. కాగా ఈ 25 ఏళ్ల కాలంలో ధర్మశ్రీ రెండు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. ధర్మశ్రీ తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచి ప్రారంభించి.. అనంతరం వైసీపీలో కొనసాగిస్తున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.