దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి అభిమానులు గుడి కట్టారు. కాగా, ఏపీ సీఎం జగన్ కు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. నవరత్నాల పేరుతో ఈ ఆలయాన్ని కట్టారు. ఈ ఆలయంలో రైతు భరోసా పింఛన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి పథకాలు పేరుతో స్థూపాలు కూడా నిర్మించారు. పేదలకు ఇళ్లు, ఫీజ్ రియంబర్స్ మెంట్ అంటూ భారీ స్తూపాలను ఏర్పాటు చేశారు. గుడిలో నవరత్నాల సృష్టికర్త ఏపీ సీఎం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆలయం కోసం ఏకంగా రెండు కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
గుడి నిర్మించడం పై స్పందించిన ఎమ్మెల్యే బియ్యపు మదు సుధన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వం లో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని తెలిపారు. తన అభిమాన నాయకుడు పై అభిమానం ను ఇలా చాటుకున్నా అని చెప్పారు. చరిత్రలో సినిమా నటులకే ఆలయాలు నిర్మించిన సంఘటనలే ఉన్నాయని మొదటిసారిగా ఓ ప్రజా నాయకుడికి గుడి ఏర్పాటు సంకల్పం జగన్ తోనే ఆరంభం అన్నారు.
తల్లిదండ్రులు, భార్యా పిల్లల కన్నా తనకు జగనే ముఖ్యమన్నారు ఎమ్మెల్యే. రాముడికి హనుమంతుడు ఎలాగో జగన్‌కు తాను అలాగే అన్నారు. మొదటి సారి ఓడిపోయిన తనకు మళ్ళీ టికెట్ ఇచ్చి జగనన్న గెలిపించారని ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకునే అందుకే ఈ నవరత్నాల ఆలయం నిర్మించాను అన్నారు గతంలో తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఓ వ్యక్తి గుడి కట్టించాడు.