రైలు, బస్సు ప్రయాణాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. అవి ఎక్కే, దిగే సమయాల్లో ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. గతంలో శశికళ అనే విద్యార్థిని ఫ్లాట్ ఫామ్ - రైలుకి మధ్య ఇరుక్కున్న సంగతి విదితమే. సుమారు రెండుగంటల పాటు నరకయాతన అనుభవించింది. తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది.
రైలు, బస్సు ప్రయాణాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. అవి ఎక్కే, దిగే సమయాల్లో ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. కాస్తంత ఏమరపాటుగా ఉన్నామా.. మనం ఎక్కాల్సిన వాహనాలే. ప్రాణాలను బలిగొంటున్నాయి. విశాఖపట్నంలోని దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ప్లాట్ ఫారమ్ పైకి వస్తున్న రైలులో నుండి దిగుతూ శశికళ అనే విద్యార్థిని ఫ్లాట్ ఫాం – రైలుకి మధ్య ఇరుక్కున్న సంగతి విదితమే. సుమారు రెండుగంటల పాటు నరకయాతన అనుభవించింది. అయితే చికిత్స పొందుతూ ఆమె మరణించింది. తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుండి మహిళ సురక్షితంగా బయటపడింది. వివరాల్లోకి వెళితే..
బాపట్ల జిల్లాలోని చీరాల రైల్వే స్టేషన్ లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. రైలు ఎక్కుతూ తిరుపతమ్మ అనే ప్రయాణీకురాలు ఆకస్మాత్తుగా జారీ పడిపోయింది. దీంతో ఫ్లాట్ ఫాం-రైలు మధ్య ఇరుక్కుపోయింది. ప్రాణ భయంతో ఆమె కేకలు వేయడంతో.. అప్రమత్తమైన రైల్వే పోలీసులు, ప్రయాణీకులు ఫ్లాట్ ఫాం దిమ్మను పగులగొట్టి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తెనాలికి చెందిన తిరుపతమ్మ ఉలవపాడు వెళ్లేందుకు విజయవాడ-గుడూరు ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. అయితే రైలు చీరాల వద్దకు రాగానే.. తిరుపతమ్మ కిందకు దిగి.. తిరిగి రైలు ఎక్కబోయింది.
రైలు మెట్టెక్కుతున్న సమయంలో ఆమె కాలు జారడంతో రైలుకు ప్లాట్‌ఫామ్‌కు మధ్యన ఇరుక్కుపోయింది. కేకలు వేయడంతో పోలీసులు, ప్రయాణీకులను అప్రమత్తం చేశారు. ఫ్లాట్ ఫాం దిమ్మను పగులకొట్టి ఆమెను బయటకు తీశారు. రైలు ఆగి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఆమెకు పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఆమె బయట పడింది. ఆమెను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తుంది. మహిళను కాపాడిన జీఆర్పీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు కోటేశ్వరరావు, నాగార్జునలను ప్రయాణికులు, స్థానికులు అభినందించారు.