ఎప్పుడు.. ఎక్కడ.. ఎలాంటి చేదు వార్త వినాల్సి వస్తుందో అని భయపడే పరిస్థితిలు వచ్చేశాయి. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని యువకులు గుండె పోటుతో మరణిస్తున్న వార్తలు దడ పుట్టిస్తున్నాయి. రోజుకో సంఘటన వెలుగు చూస్తోంది. రెండ్రోజుల క్రితం సీఎంఆర్ కాలేజీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్ధి గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు విడవగా, నిన్న ఖమ్మంకు చెందిన ఇంటర్ విద్యార్థి సడన్ కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటనలు మరవకముందే మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
ఎప్పుడు.. ఎక్కడ.. ఎలాంటి చేదు వార్త వినాల్సి వస్తుందో అని భయపడే పరిస్థితిలు వచ్చేశాయి. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని యువకులు గుండె పోటుతో మరణిస్తున్న వార్తలు దడ పుట్టిస్తున్నాయి. రోజుకో సంఘటన వెలుగు చూస్తోంది. రెండ్రోజుల క్రితం సీఎంఆర్ కాలేజీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్ధి గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు విడవగా, నిన్న ఖమ్మంకు చెందిన ఇంటర్ విద్యార్థి సడన్ కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటనలు మరవకముందే మరొకరు ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గుండె నొప్పి ఉందని కేకలు వేసిన యువకుడు.. ఆస్పత్రికి తరలించే లోపే లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు.
పల్నాడు జిల్లా, చిలకలూరిపేట పట్టణం పసుమరుకు చెందిన షేక్ ఫిరోజ్(17) విద్యార్థి అర్ధరాత్రి రెండు రెండు గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు. ఎప్పటిలానే కుటుంబసభ్యులతో కలిసి రాత్రి భోజనం చేసిన ఫిరోజ్ గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. అనంతరం అర్ధరాత్రి సమయంలో కేకలు వినపడడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా, గుండెలో నొప్పి వస్తోందని చెప్పాడు. ఖంగారుపడ్డ తల్లిదండ్రులు హుటాహుటీన అతనిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రి తరలించగా, పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఫిరోజ్ స్థానికంగా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
అప్పటివరకు అందరితో కలిసిమెలిసి తిరిగిన యువకులు, అర్ధాంతరంగా కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతున్నారు. అందులోనూ వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. దీంతో అసలు గుండెకు ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యాక్సిన్ ప్రభావమని కొందరు, గుండెలో హోల్స్ బ్లాక్ అవ్వడం వల్ల ఇలా జరుగుతోందని మరికొందరు చెప్తున్నారు. బయటకు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి చేరతారో.. లేదో అన్న భయం ఇంటిల్లిపాదిని వెంటాడుతోంది. గుండెపోటు మరణాలు ఎందుకు పెరుగుతున్నాయో..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.