ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్య కర్తలు, అభిమానుల నుంచి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి శుభా కాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి. 1972 డిసెంబర్ 21న జమ్మలమడుగులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే జగన్ ’బ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్ కు చంద్రబాబు విషెస్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. బర్త్ డే సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సహా, తెలుగు రాష్ట్రాల ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు జగన్ జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. రక్తదానం, అన్నదానం, మొక్కలు నాటడం, దుప్పట్లు, పండ్లు పంచడం వంటి కార్యక్రమాలను కార్యకర్తలు చేపట్టారు.
Happy Birthday @ysjagan.
— N Chandrababu Naidu (@ncbn) December 21, 2021