Chandrababu Naidu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీలో సీనియర్ నాయకుల పని తీరుపై దృష్టి సారించారు. తాను సీనియారిటీని గౌరవిస్తానని, సిన్సియారిటీని గుర్తిస్తానని అన్నారు. ఓట్లు వేయించలేని సీనియర్లు పార్టీలో తమకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరితే టీడీపీ ప్రతిపక్షంలోనే ఉంటుందని పేర్కొన్నారు. గురువారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు పార్టీ నేతలకు దిశా నిర్థేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ పార్టీలో పనిచేసే నేతలు గ్రౌండ్ లెవెల్‌లో పని చేయకుండా మాయ చేస్తే చెక్ పెడతా. కొంతమంది నేతలు ఫీల్డులో పని చేయకుండా.. పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉంటారు.
అలాంటి నేతలకు కాలం చెల్లింది. పార్టీ కోసం ఎవరు పని చేస్తున్నారు.. ఎవరు తప్పించుకు తిరుగుతున్నారు అనేది మానిటర్ చేసేందుకు ఓ సిస్టమ్ వచ్చింది. పార్టీలోని కొందరు సీనియర్ నేతల వారసులు రాజకీయాల్లోకి వచ్చారు. మరికొందరి వారసులు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. వారు కూడా రాజకీయాల్లోకి రావాలి. తటస్థంగా ఉండే యువకులూ టీడీపీలోకి రావాలి. పార్టీలో కష్టపడి పనిచేసే యువ నేతలను గుర్తిస్తాం. వారందరికీ అవకాశాలిస్తాం. పార్టీ సభ్యత్వ నమోదు.. సంస్థాగత ఎన్నికలు ఓ పద్ధతిగా చేపట్టడం టీడీపీ ఆనవాయితీ’’ అని అన్నారు. మరి, పార్టీ సీనియర్లపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఆ గ్రామంలో లాక్ డౌన్, ఎవరూ రాకుండా కంచెలు.. కారణం కరోనా మాత్రం కాదు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.