టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు రెండు రోజుల క్రితం కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. వెంకట్రావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో యడ్లపాటి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. టీడీపీ జెండాను యడ్లపాటి పార్థివదేహంపై ఉంచిన చంద్రబాబు నివాళులు అర్పించారు. అనంతరం వెంకట్రావు పాడెను మోశారు. యడ్లపాటి వెంకట్రావు జీవితం అందరికీ ఆదర్శమన్నారు చంద్రబాబు. యడ్లపాటి మంచి విద్యావంతుడని.. ప్రజల కోసం జీవితాంతం పని చేశారన్నారు. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో వెంకట్రావుని చూసి నేర్చుకోవాలన్నారు.
యడ్లపాటి వెంకట్రావు కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కుమార్తె నివాసంలో సోమవారం ఉదయం కన్నుమూశారు. యడ్లపాటి వెంకట్రావు 1919 డిసెంబర్ 16న గుంటూరుజిల్లా అమృతలూరు మండలంలోని బోడపాడులోని రైతు కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు యడ్లపాటి వెంకట సుబ్బయ్య, రాఘవమ్మ. ఆయన గుంటూరు ఏసీ కాలేజీలో బీఏ చదివారు.. తర్వాత మద్రాసు లా కాలేజీలో చదువుతూ అందులో ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు. తర్వాత న్యాయవాద వృత్తిని ఎంచుకుని.. న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. ఆయన అలవేలు మంగమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
అంతేకాదు యడ్లపాటి వెంకట్రావు ప్రముఖ రైతు నాయకుడు ఎన్.జి.రంగా ముఖ్య అనుచరుడిగా.. ఆయనతో కలిసి నడిచారు. ఎన్.జి రంగాతో కలిసి 1951లో కృషీకార్ లోక్ పార్టీ స్థాపనలో ప్రముఖ పాత్ర వహించారు. 1959లో ఎన్.జి రంగా రాజగోపాలాచారి తో కలసి స్థాపించిన స్వతంత్ర పార్టీ లో చేరారు. 1980 ప్రాంతంలో టీడీపీలో చేరి.. పార్టీలోనే కొనసాగారు. రాజకీయాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.