టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నందమూరి వారసుడు తారకరత్న గుండెపోటుకు గురవ్వడం.. దీంతో ఆయనను కుప్పంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే.. వైద్యులు తారకరత్న ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూడడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నందమూరి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు.
తారకరత్నను అలా చూసి నందమూరి కుటుంబసభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఆ దృశ్యాలను చూసి ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటున్నారు. తారకరత్న లేవాలని దేవుడిని ప్రార్థించని నందమూరి అభిమాని లేరు. ‘తారకరత్న- ఎన్టీఆర్’ ఇద్దరూ కలిసి ఒకే చోట పెద్దగా కనిపించింది లేదు. ఎక్కువగా కనిపించినప్పటికీ.. అన్నదమ్ముల ఆప్యాయత, ప్రేమానుబంధాలు మనసులో ఎప్పుడూ ఉంటాయి. ఎన్టీఆర్ ముఖంలో అన్న మీద ఉన్న ప్రేమ కనబడుతోంది. యువగళం ప్రచారంలో చురుగ్గా పాల్గొంటే చూడాల్సిన అన్నను.. ఇలా హాస్పిటల్ బెడ్ పై చూడాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ తన అన్నను అలా చూసేసరికి ఎన్టీఆర్ బాగా ఎమోషనల్ అయిపోయారు. అన్న లేవాలి, తిరిగి ఇంటికి క్షేమంగా రావాలన్న కోరిక తారక్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక బాలకృష్ణ కూడా ప్రతి నిమిషం తారకరత్న వెన్నంటే ఉండడం.. అతనితో పాటు అంబులెన్సులో ప్రయాణించడం అందరికీ తెలిసిందే.
తారకరత్నకు ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. వైద్యులు ఎక్మో ద్వారా ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇతర వ్యాధులతో బాధపడుతూ గుండె, ఊపిరితిత్తులు పనిచేయని వారికి ‘ఎక్మో’ ద్వారా చికిత్స అందిస్తారు. ఈ రెండు ప్రధాన అవయవాల బాధ్యతను ఎక్మో పరికరం తలకెత్తుకుని ప్రాణాలను నిలబెడుతుంది. రోగి తనంతట తాను స్వయంగా శ్వాస తీసుకోలేని సందర్భంలో ఎక్మో పరికరం ఉపయోగపడుతుంది. అలాగే గుండె కవాటాలు దెబ్బతిని, గుండె పనిచేయని స్థితిలో కూడా ఇదే పరికరం తోడ్పడుతుంది. ఇప్పుడు తారకరత్న పరిస్థితి దాదాపుగా ఇదే అని వైద్యుల హెల్త్ బులిటెన్‌తో స్పష్టమైంది. ప్రస్తుతం తారకరత్న భార్య, కుమార్తెలు బెంగళూరు ఆసుపత్రిలోనే ఉన్నారు. తారకరత్న తిరిగి రావాలని మనమూ ఆశిద్దాం..
నందమూరి తారకరత్నను పరామర్శించడానికి బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ కుటుంబం మరియు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం.#TarakaRatna #NandamuriTarakaRatna #TarakaRatna pic.twitter.com/369j9EiBj3
— BABU GARI ABHIMANI (@TdpParty9) January 29, 2023