నాయకుడు చేసే ఓ మంచి ఆలోచన లక్షల మందికి ప్రయోజనం చేకూరుస్తుంది. కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది. అచ్చం ఇలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఆలోచన ఇప్పుడు దేశానికే ఆదర్శం అయ్యింది. ఆ ఆలోచనే ఇప్పుడు మన దేశంలోని ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాలను మార్చబోతుంది. తెలుగు వారంతా గర్వించతగ్గ ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రభుత్వ పాఠశాలలను.. ప్రైవేటు స్కూల్స్‌కు ధీటుగా తీర్చిదిద్దడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన అత్యద్భుతమైన కార్యక్రమం ‘మనబడి నాడు-నేడు’. విద్యారంగ సంస్కరణల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇప్పటికే ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వానికి కూడా స్ఫూర్తిగా నిలిచింది. సీఎం జగన్ ప్రారంభించిన నాడు-నేడు కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర ప్రభుత్వ కూడా పీఎం శ్రీ పేరుతో అన్ని సదుపాయాలతో కూడిన పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 14,500 పైగా స్కూళ్లను ప్రారంభించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పైలట్ ప్రతిపాదిక.. మొదలయ్యే ఈ ప్రాజెక్ట్ ఐదేళ్లపాటు కొనసాగనుంది.
అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు మనబడి నాడు-నేడు కార్యక్రామాన్ని ప్రారంభించారు. దీని ద్వారా పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. అనగా నీటి వసతి కలిగి ఉన్న టాయిలెట్లు, సురక్షిత తాగునీరు, చిన్నాచితకా రిపేర్లు, కరెంట్ సరఫరా, ప్రతి తరగతి గదికి ఫ్యాన్లు, డ్యూయెల్ డెస్క్‌లు, విద్యార్థులకు సరిపడా బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుల్స్, గ్రీన్ చాక్ బోర్డులతో పాటు పాఠశాల భవనాలకు ఆహ్లాదకరమైన రంగులు వేయడం, ల్యాబ్, కాంపౌండ్ గోడల నిర్మాణం చేపడతారు. వీటితోపాటు అన్ని హైస్కూళ్లలో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయడమే కాక.. 8వ తరగతికి వచ్చేసరికే విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 7 పీఎం శ్రీ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఐదేళ్ల కాలపరిమితిలో 14,500 పాఠశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఏపీలో మాత్రం శాశ్వత ప్రతిపాదికన ఈ కార్యక్రమం అమలు కానుంది. ఇలా.. ప్రధాని మోదీ సైతం సీఎం జగన్ ఆలోచనని ఆదర్శంగా తీసుకోవడం నిజంగా తెలుగువారంతా గర్వించతగ్గ విషయం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.