ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని.. సంకల్పించింది.ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 13 జిల్లా ఉన్నాయి. వాటిని ప్రభుత్వం 26 జిల్లాలుగా మారూస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటు అవుతున్న 13 జిల్లాలు వాటి పేర్లు.. అలాగే 12 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంగళవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికికేషన్ విడుదల చేసింది. అయితే వీటిపి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే.. 30 రోజుల సమయం ఇచ్చింది. కొత్త జిల్లాలపై వచ్చిన సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఉగాది నాటికి కొత్త నోటిఫికేషన్ వేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది.
ఇక కొత్త జిల్లాల మీద కొత్త ఏపిలో రాజకీయాల్లో అగ్గి రాజుకుంది. దీని మీద ఇపుడిపుడే విపక్షాలు పెదవి విప్పుతున్నాయి. మరో వైపు సెంటిమెంట్ కూడా ఏ జిల్లాకు ఆ జిల్లాలో రాజుకుంటోంది. ఒకదశలో సొంత పార్టీవారే కొన్ని చోట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది. కేంద్ర జనగణన శాఖ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. జనగణన సందర్భంగా జూన్ మాసం వరకు జిల్లాల సరిహద్దులో మార్చవద్దని ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.
ఇది చదవండి : ప్రభాస్ మూవీ ‘పాన్ వరల్డ్’గా రిలీజ్ కాబోతుందా?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లకు ఈ మేరకు జన గణన డిప్యూటీ డైరెక్టర్ లేఖ రాశారు. జనగణన పూర్తి కాకుండా జిల్లాల సరిహద్దులు మారిస్తే ఇబ్బందులు తప్పవని కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అర్జంటుగా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది కరోనా వ్యాక్సినేషన్ మీద అని కూడా కేంద్రం గుర్తు చేసినట్లు తెలుస్తుంది. కరోనా మహమ్మారి, కరోనా వ్యాక్సిన్, వర్షం కారణంగా జనగణనలో జాప్యం జరుగుతోందని డిప్యూటీ డైరెక్టర్ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయం పై ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.