స్కూల్ లో అప్పటి వరకు అందరితో మాట్లాడుతూ పాఠాలు వింటున్న ఓ విద్యార్థిని ఉన్నట్టుండి స్కూల్ బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్యా యత్నం చేసింది. దీంతో అలర్ట్ అయిన స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలికను రక్షించారు. గంటలకు పైగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే..
నూనె హేమ అశ్రిత అనే విద్యార్థిని తొమ్మిదవ తరగతి చదువుతుంది. గత కొన్ని రోజులుగా ఆ బాలికకు మార్కులు తక్కువగా వస్తుండటంతో అటు స్కూల్ టీచర్లు ఇటు ఇంట్లో పేరెంట్స్ గట్టిగా అడగడంతో మనస్థాపానికి గురైంది. దీంతో తాను ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సాయంత్రం క్లాస్ రూమ్ నుంచి వెళ్లిపోయి 5 అంతస్తుల స్కూల్ బిల్డింగ్ ఎక్కింది. అక్కడే ఉన్న పిట్టగోడపైకి వచ్చి తాను దూకి చనిపోతానని చెప్పింది. దాంతో అలర్ట్ అయిన స్కూల్ సిబ్బంది వెంటనే సీఐ కి ఫోన్ చేశారు. తన బలగంతో సీఐ శివ గణేష్ పాఠశాలకు చేరుకున్నాడు.
అగ్ని మాకప సిబ్బంది తో పాటు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో సీఐ, ఎస్సై ఇద్దరూ పాఠశాల బిల్డింగ్ ఎక్కి బాలికను రక్షించే యత్నం చేశారు. మరోవైపు కింద స్థానికుల సహాయంతో పరదా ఏర్పాటు చేశారు. కానీ విద్యార్థిని మాత్రం పరదా వైపు కాకుండా మరోవైపు వెళ్తూ అందరినీ భయపెట్టింది. అక్కడ ఉన్నవారంతా బాలిక ఎక్కడ స్లిప్ అయి పడిపోతుందో అని భయపడసాగారు. మొత్తానికి అక్కడ గంట పాటు హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
సీఎం గణేష్, ఎస్ ఐ శివకృష్ణ లు ఎంతో సమయస్ఫూర్తి ప్రదర్శించి… ధైర్యం చేసి పాప వద్దకు వెళ్లి దైర్యం చెప్పి రక్షించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నాడు.. బాలికను రక్షించిన సీఐ, ఎస్ ఐ లను తల్లిదండ్రులతో పాటు స్థానికులు, స్కూల్ యాజమాన్యం ప్రశంసించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎమ్మెల్సీ తొట త్రిమూర్తులు, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావులు సీఎం గణేష్, ఎస్ ఐ శివకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.