ఈ మద్య కొంతమంది యువకులు యువతులను ప్రేమ పేరుతో దారుణంగా మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. యువకుల చేతిలో మోసపోయిన యువతులు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.. కొంతమంది పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఈ మద్య ప్రేమించి పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చి మోసగించిన కేసులు ఎన్నో వెలుగు చూశాయి. యువతులకు మాయ మాటలు చెప్పి ప్రేమలోకి దింపి అవసరం తీరిన తర్వాత ముఖం చాటేస్తున్న కేటుగాళ్లపై పలు కేసులు నమోదు అవుతున్నాయి. కొంతమంది యువతులు తాము మోసపోయామన్న బాధలు డిప్రేషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పపడుతుండగా.. కొంతమంది యువతులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. తాజాగా ఓ యువతి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నిశ్చితార్థం చేసుకున్న యువకుడు మరో యువతి ప్రేమించి తనను మోసం చేశాడని పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. వివరాల్లోకి వెళితే..
చిత్తూరు జిల్లా కు చెందిన మణి కుమార్తే నక్షత్ర బెంగుళూరులో డిగ్రీ చదువుతంది. అదే ఏరియాకు చెందిన మూర్తి కుమారుడు ఆకాశ్ అనే యువకుడు గత కొంత కాలంగా నక్షత్రను ప్రేమిస్తున్న అంటూ వెంటపడసాగాడు. కొంతకాలం తర్వాత ఆకాశ్ ప్రపోజల్ ఓకే చేసింది నక్షత్ర. ఇలా కొంతకాలం పాటు ఇద్దరూ ప్రేమించుకున్న తర్వాత విషయం పెద్దలకు తెలియడంతో తమకు పెళ్లి జరిపించాలని పెద్దలను కోరారు. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఓకే చెప్పడంతో నిశ్చితార్థం కూడా ఘనంగా జరిపించారు. అయితే నక్షత్ర ఎడ్యూకేషన్ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు ఓకే చెప్పారు.
ఇలా కొన్ని నెలల తర్వాత ఆకాశ్ అదే ఏరియాలో మరో యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతన్నాడు. ఈ విషయం కాస్త మాజీ లవర్ నక్షత్రకు తెలియడంతో మొదట షాక్ తిన్నది. తనను ఎంతగానో ప్రేమిస్తున్న వ్యక్తి మోసం చేస్తున్నాడని గ్రహించింది. ఇదే విషయంపై ఆకాశ్, నక్షత్రకు మద్య వివాదం మొదలైంది.. ఇద్దరి మద్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో సమస్యను పరిష్కరించుకుందాం.. నీతో మాట్లాడాలని నక్షత్రను తీసుకొని బెంగుళూరులో ఓ పాత భవంతిపైకి తీసుకు వెళ్లాడు. అలా మాట్లాడుతన్న సమయంలోనే నక్షత్రను పై నుంచి తోసేశాడు. దీంతో నక్షత్రకు తీవ్ర గాయాలు కావడం.. కాళ్లు విరిగిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆమె వీల్ చైర్ కే పరిమితం అయ్యింది. నడవలేని అమ్మాయిని తమ ఇంటికి కోడలిని చేసుకోం అంటూ ఆకాశ్ తల్లిదండ్రులు ప్లేట్ ఫిరాయించారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాల్సిందిగా ప్రార్ధించింది.