మనిషికి ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హఠాత్తుగా గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలిపోతున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కొంతమంది అనుకోని ప్రమాదాల వల్ల దుర్మరణం చెందుతున్నారు.
మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు.. కాలం కలిసి రాకుంటే పామే కాటు వేస్తుందని అంటుంటారు. ఆంధ్రప్రదేశ్ లో దారుణ ఘటన చేసుకుంది. అనంతపురం జిల్లా ఆర్టీవో ఆఫీస్ సమీపంలో పేలుడు సంభవించింది. కెమికల్ డబ్బా ఓపెన్ చేస్తుండగా ఈ పేలుడు ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే పేలుడు థాటికి ఓ వ్యక్తి ముక్కలు ముక్కలై దుర్మరణం చెందినట్లు తెలుస్తుంది. పేలుడు శబ్ధం రావడంతో చుట్టుపక్కల జనాలు ఒక్కసారే భయాందోళనకు గురయ్యారు. అయితే చనిపోయిన వ్యక్తి ఎవరు అన్న విషయం గురించి వివరాలు తెలియరాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.